ముంబయిలో సెక్షన్‌ 144 విధింపు

తాజా వార్తలు

Updated : 02/07/2020 01:28 IST

ముంబయిలో సెక్షన్‌ 144 విధింపు

కఠిన చర్యలు తీసుకోనున్నట్లు పోలీసుల వెల్లడి

దిల్లీ: మహారాష్ట్రలో కరోనా వైరస్ విలయతాండవం సృష్టిస్తోంది. వైరస్‌తో రాష్ట్ర రాజధాని ముంబయిలో పరిస్థితులు అధ్వానంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో మహమ్మారి కట్టడికి ప్రభుత్వ పలు చర్యలు చేపడుతోంది. బుధవారం నుంచి ముంబయి వ్యాప్తంగా 144 సెక్షన్ విధిస్తున్నట్లు నగర పోలీసులు వెల్లడించారు. మత ప్రదేశాలతో సహా బహిరంగ ప్రదేశాల్లో ఎక్కువ మంది గుమిగూడినట్లయితే వారిపై చట్టరీత్య చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు. ఈ దిశగా నగర పోలీసు డిప్యూటీ కమిషనర్ ప్రణయ అశోక్ ఉత్తర్వులను జారీ చేశారు. జులై 15 వరకు  ఈ నిబంధనలు అమలులో ఉండనున్నట్లు పేర్కొన్నారు.

మంగళవారం కొత్తగా నమోదయిన 893 కేసులతో ముంబయిలో ఇప్పటివరకు 77 వేల కేసులు నమోదయ్యాయి.  4556 మంది మృత్యువాత పడ్డారు. ముంబయి సహా దాని చుట్టుపక్కల నగరాల్లోనూ కరోనా విజృంభిస్తోంది. గడిచిన వారంరోజుల్లోనే ఒక్క థానే నగరంలో 2,533 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో థానేతొపాటు కేసులు అధికంగా ఉన్న మీరా-భయాండర్‌లో స్థానిక అధికారులు జూన్‌ 12 వరకు లాక్‌డౌన్‌ ప్రకటించారు. ముంబయిలో వినాయక చవితిని అత్యంత వైభవంగా జరుపుకొనే లాల్‌బాగ్‌చ రాజా గణేష్ మండలి కొవిడ్ -19 కారణంగా ఈ ఏడాది వినాయక చతుర్థి వేడుకను రద్దు చేస్తున్నట్లు బుధవారం ప్రకటించింది.
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని