అంబులెన్స్ కోసం‌ ‌నిరీక్ష‌ణ‌, కొవిడ్ రోగి మృతి!

తాజా వార్తలు

Published : 04/07/2020 23:51 IST

అంబులెన్స్ కోసం‌ ‌నిరీక్ష‌ణ‌, కొవిడ్ రోగి మృతి!

బెంగ‌ళూరులో మ‌రో విషాధ ఘ‌ట‌న‌

బెంగ‌ళూరు: ‌దేశ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ మ‌హమ్మారి విజృంభిస్తోన్న వేళ ప‌లుచోట్ల‌ విషాద ఘ‌ట‌న‌లు చోటుచేసుకుంటున్నాయి. ఈ మ‌ధ్యే కోల్‌క‌తాలో క‌రోనాతో మృతి చెందిన వ్య‌క్తి దేహాన్ని 48గంట‌ల‌పాటు ఇంట్లోనే ఉంచాల్సిన ప‌రిస్థితి ఓ కుటుంబానికి ఎదురైంది. తాజాగా ఇలాంటి ఘ‌ట‌నే బెంగ‌ళూరులో వెలుగు చూసింది.

శ్వాస‌ తీసుకోవ‌డంలో ఇబ్బంది ప‌డుతున్న  55ఏళ్ల వ్య‌క్తిని ఆసుప‌త్రికి తీసుకెళ్ల‌గా క‌రోనా పాజిటి‌వ్ అని నిర్ధార‌ణ అయ్యింది. దీంతో ఇంటి ద‌గ్గ‌రే ఉంచి అత‌నికి చికిత్స అందిస్తున్నారు. తాజాగా అత‌ని ఆరోగ్యప‌రిస్థితి క్షీణించింది. ఈ విష‌యాన్ని ఆసుప‌త్రికి తెలియ‌జేసిన కుటుంబ‌స‌భ్యులు వెంట‌నే అంబులెన్సును పంపించాల‌ని కోరారు. గంట‌లు గ‌డుస్తున్నా అంబులెన్స్ రాక‌పోవ‌డంతో ఆటోలో అసుప‌త్రికి తీసుకెళ్లేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఇంటి నుంచి బ‌య‌ట‌కు తీసుకురాగానే ఆ వ్య‌క్తి ఒక్క‌సారిగా కుప్ప‌కూలి ప్రాణాలు కోల్పోయాడు. ఇది జ‌రిగిన‌ రెండుగంట‌ల తర్వాత అంబులెన్సు అక్క‌డ‌కు చేరుకుందని మృతుని భార్య ఆవేద‌న వ్య‌క్తం చేసింది. క‌రోనా సోకిన త‌న భ‌ర్త‌ మృత‌దేహంతో గంట‌ల‌పాటు వీధిలోనే నిరీక్షించాల్సి వ‌చ్చింద‌ని ఆమె వాపోయింది. ఇలా క‌రోనా రోగుల విష‌యంలో నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్న అధికారుల తీరుపై స్థానికులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

ఈ ఘ‌ట‌న‌పై కొవిడ్‌-19 వ్య‌వ‌హారాల‌కు ఇంఛార్జి  వ్యవ‌హ‌రిస్తున్న క‌ర్ణాట‌క రాష్ట్ర రెవెన్యూశాఖ‌ మంత్రి ఆర్.అశోక్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ ఘ‌ట‌న‌పై పూర్తి ద‌ర్యాప్తునకు ఆదేశించారు. దీనికి కార‌ణ‌మైన వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు. రాష్ట్రంలో ఆరోగ్య సేవ‌ల‌పై ఇప్ప‌టికే చాలా ఒత్తిడి పెరిగింద‌ని, అయిన‌ప్ప‌టికీ ఇలాంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా చూస్తామ‌ని బెంగ‌ళూరు మునిసిప‌ల్ క‌మిష‌న‌ర్ అనిల్ కుమార్ ప్ర‌క‌టించారు.

ఇదిలా ఉంటే, గ‌త వారం రోజులుగా బెంగ‌ళూరులో క‌రోనావైర‌స్ తీవ్ర‌త ఒక్క‌సారిగా పెరిగింది. కేవ‌లం శుక్ర‌వారం ఒక్క‌రోజే న‌గ‌రంలో దాదాపు వెయ్యి పాజిటివ్ కేసులు బ‌య‌ట‌ప‌డ్డాయి. దీంతో బెంగ‌ళూరులో పాజిటివ్ కేసుల సంఖ్య 7,173 చేర‌గా 106మంది మృత్యువాతప‌డ్డారు. ఇక క‌ర్ణాట‌క‌లో కేసుల సంఖ్య 19,710కి చేరగా 293మంది ప్రాణాలు కోల్పోయారు.‌


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని