6నగరాల నుంచి కోల్‌కతాకు విమానాలు బంద్‌

తాజా వార్తలు

Updated : 04/07/2020 17:43 IST

6నగరాల నుంచి కోల్‌కతాకు విమానాలు బంద్‌

ఆ 6 ప్రధాన నగరాల నుంచే..

కోల్‌క్‌తా: పశ్చిమబెంగాల్‌లో కరోనా విజృంభణ కొనసాగుతున్న వేళ అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోల్‌కతా విమానాశ్రయానికి వచ్చే విమానాల రాకపోకలపై ఆంక్షలు విధించాలని విమానాశ్రయ డైరెక్టర్‌కు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఈ నెల 6 నుంచి 19 వరకు కోల్‌కతాకు విమాన రాకపోకలపై ఆంక్షలు విధిస్తున్నట్టు డైరెక్టర్‌ వెల్లడించారు.  బెంగాల్‌ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం ఆంక్షలు విధిస్తున్నట్టు తెలిపారు. దిల్లీ, ముంబయి, పుణె, నాగ్‌పూర్‌, చెన్నై, అహ్మదాబాద్‌ నుంచి కోల్‌కతాకు వచ్చే విమానాల రాకపోకలపై ఆంక్షలు ఉంటాయన్నారు. తదుపరిఆదేశాలు వచ్చే వరకు  ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని చెప్పారు. ఇప్పటివరకు బెంగాల్‌లో 20,488 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. వారిలో 717మంది మృత్యువాతపడ్డారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని