సోషల్‌ మీడియా విమర్శలకు ఆర్మీ సమాధానం

తాజా వార్తలు

Published : 05/07/2020 08:50 IST

సోషల్‌ మీడియా విమర్శలకు ఆర్మీ సమాధానం

దిల్లీ: లేహ్‌ ఆసుపత్రిలో భారత సైనికులకు అందుతున్న చికిత్సను విమర్శిస్తూ సామాజిక మాధ్యమాలలో వ్యాఖ్యలు రావడంపై సైన్యం స్పందించింది. అవి హానికర, ఆధారాలు లేని ఆరోపణలని ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రధాని మోదీ శుక్రవారం లేహ్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ పెద్ద హాలులో పడకలపై ఉన్న సైనికులను పరామర్శించారు. ఈ ఫొటోలను పలువురు షేర్‌ చేస్తూ.. అదసలు ఆస్పత్రిలా లేదని, పడకల వద్ద మందులు, సెలైన్‌ స్టాండులు, చికిత్స సామగ్రి ఏవీ కనిపించడం లేదంటూ చేసిన వ్యాఖ్యలు ట్విటర్‌లో చక్కర్లు కొట్టాయి. సైనికులు పడకలపై ఉన్నది అంతకుముందు శిక్షణ హాల్‌ అని, లేహ్‌ ఆస్పత్రిని కొవిడ్‌ ఆస్పత్రిగా మార్చాక ఆ హాలును కూడా ప్రత్యేక వార్డుగా చేసినట్టు సైన్యం చెప్పింది. సైనికులకు ఉత్తమ వైద్యం అందిస్తున్నట్టు స్పష్టం చేసింది. ధైర్యవంతులైన మన సైనికులకు అందుతున్న చికిత్సపై విమర్శలు రావడం దురదృష్ణకరమని పేర్కొంది. గల్వాన్‌ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో భారత సైనికులు 20 మంది వీరమరణం చెందగా గాయపడిన పలువురు చికిత్స పొందుతున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని