ప్లాస్మా దానం చేసిన సంబిత్‌ పాత్రా

తాజా వార్తలు

Published : 07/07/2020 03:56 IST

ప్లాస్మా దానం చేసిన సంబిత్‌ పాత్రా

దిల్లీ:  కరోనా నుంచి కోలుకొని ఇంటికి చేరిన భాజపా అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్రా సోమవారం తన ప్లాస్మాను దానం చేశారు. ఇటీవల పార్టీ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ.. ప్రతిఒక్కరూ సేవాభావాన్ని కలిగి ఉండాలని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఆ మాటల స్ఫూర్తితోనే తాను ప్లాస్మా దానం చేసినట్లు సంబిత్‌ పాత్రా తెలిపారు. అంతకుముందు భాజపా జాతీయాధ్యక్షుడు జె.పి.నడ్డా ఆశీస్సులు తీసుకున్నట్లు పేర్కొన్నారు. కరోనాను జయించి ఆరోగ్యంగా ఉన్నవారు ప్లాస్మాను దానం చేయాలని ఈ సందర్భంగా సంబిత్‌ పాత్రా ప్రజలకు కోరారు. కరోనా సోకడంతో సంబిత్‌ పాత్రా గత నెల గురుగ్రామ్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. కొన్ని రోజుల చికిత్స అనంతరం కోలుకున్న ఆయన ఇటీవలే ఇంటికి చేరకున్నారు. 

కరోనా సోకి నయమైన వ్యక్తి రక్తాన్ని ప్లాస్మా థెరపీలో సేకరిస్తారు. అనంతరం దాని నుంచి ప్లాస్మాను వేరుచేస్తారు. ఇలా వేరుచేసిన ప్లాస్మాను అత్యవసర చికిత్స పొందుతున్న కరోనా బాధితునికి ఎక్కిస్తారు. కోలుకున్న వ్యక్తిలో కరోనా వైరస్‌పై పోరాడే శక్తి కలిగిన యాంటీబాడీస్‌ ఎక్కువగా ఉంటాయి. అందుకే, ఇటువంటి వ్యక్తి నుంచి సేకరించిన ప్లాస్మాను కరోనా బాధితుడికి ఎక్కించడం ద్వారా అతడి శరీరంలో యాంటీబాడీస్‌ వృద్ధిచెంది వైరస్‌పై పోరాడటంలో దోహదపడతాయి. దీంతో అతడు ఈ వైరస్‌ బారినుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పటికే దీన్ని ప్రయోగాత్మకంగా అనేక దేశాల్లో వినియోగిస్తున్నారు. సానుకూల ఫలితాలు ఉండడంతో ఈ చికిత్సను విస్తృతపరిచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని