30లోగా మహిళలకు పర్మినెంట్‌ కమిషన్‌

తాజా వార్తలు

Published : 07/07/2020 23:10 IST

30లోగా మహిళలకు పర్మినెంట్‌ కమిషన్‌

 గడువు విధించిన సుప్రీం 

దిల్లీ: భారతీయ సైన్యంలో మహిళా అధికారులకు నిర్దేశించిన విభాగాల్లో పర్మినెంట్‌ కమిషన్‌ను మంజూరు చేయడంపై సుప్రీం కోర్టు మరోమారు స్పందించింది. 30 రోజుల్లోపు అర్హులకు పర్మినెంట్‌ కమిషన్‌ ఇవ్వాలని పేర్కొంది. తమ ఆదేశాలను అమలు చేయాలని గడువు విధించింది. జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని బెంచ్‌ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. గతంలో సుప్రీం ఇచ్చిన తీర్పులో అంశాలు మొత్తాన్ని అమలు చేయడానికి ఆరునెలల సమయం కావాలని కేంద్రం కోరింది. కొవిడ్‌ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని ఈ మినహాయింపు ఇవ్వాలని కోరింది. 
సైన్యంలో మహిళలకు పర్మినెంట్‌ సర్వీసు ఇవ్వడంపై సుప్రీంకోర్టు ఫిబ్రవరి 17 తీర్పు ఇచ్చింది. నిర్ణీత విభాగాల్లో కమాండింగ్‌ అధికారిగా పోస్టింగ్‌లు ఇవ్వాలని ఆదేశించింది.  దీనికి సంబంధించిన పేపర్‌ వర్క్‌ పూర్తయిందని ఇప్పటికే రక్షణ మంత్రిత్వ శాఖ న్యాయస్థానానికి వెల్లడించింది. ఆదేశాలు జారీ చేయడమే తరువాయి అని పేర్కొంది. దీంతో న్యాయస్థానం మరో 30రోజుల గడువు ఇచ్చింది. 

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని