మహారాష్ట్ర ప్రభుత్వంపై సుప్రీం అసంతృప్తి

తాజా వార్తలు

Published : 09/07/2020 12:45 IST

మహారాష్ట్ర ప్రభుత్వంపై సుప్రీం అసంతృప్తి

దిల్లీ: స్వరాష్ట్రాలకు వెళ్లాలనుకునే వారిని గుర్తించడం రాష్ట్రాల బాధ్యత అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వలస కూలీల అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ అశోక్ భూషణ్ ధర్మాసనం కేసును సుమోటోగా తీసుకుని విచారించింది. వలస కూలీల సమస్యల పరిష్కారానికి జాతీయ విధానం రూపొందించాలని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ న్యాయస్థానాన్ని కోరారు. కరోనా నిర్వహణలో భాగంగా ఇప్పటికే అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్నామని సొలిసిటర్‌ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. అయితే మహరాష్ట్ర ప్రభుత్వ అఫిడవిట్ పై అసంతృప్తి వ్యక్తం సుప్రీంకోర్టు చేసింది.  మహరాష్ట్ర వలస కూలీల అంశంపై వారం రోజుల్లో సమగ్రంగా అఫిడవిట్ వేయాలని మహారాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.  తదుపరి విచారణను జులై 17కి వాయిదా వేసింది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని