సుంద‌ర్ పిచాయ్‌-ప్ర‌ధాని మోదీ భేటీ!

తాజా వార్తలు

Published : 13/07/2020 16:07 IST

సుంద‌ర్ పిచాయ్‌-ప్ర‌ధాని మోదీ భేటీ!

 వ‌ర్చువ‌ల్ భేటీలో విస్తృత అంశాల‌పై చ‌ర్చ

దిల్లీ: గూగుల్ సీఈఓ సుంద‌ర్ పిచాయ్‌, ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఈ ఉద‌యం భేటీ అయ్యారు. వ‌ర్చువ‌ల్ ప‌ద్ధ‌తిలో జ‌రిగిన స‌మావేశం‌లో రైతులు, పారిశ్రామిక‌వేత్త‌ల ప్ర‌యోజ‌నాల కోసం అవ‌స‌ర‌మైన సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని రూపొందించే విష‌యాల‌పై సుదీర్ఘంగా చ‌ర్చించిన‌ట్లు ప్ర‌ధాని న‌రేంద్రమోదీ ట్విట‌ర్‌లో పేర్కొన్నారు. అంతేకాకుండా ప్ర‌పంచాన్ని ప‌ట్టిపీడిస్తోన్న క‌రోనా వైర‌స్‌తోపాటు ఈ సంక్షోభం వ‌ల్ల వ‌చ్చిన‌ నూతన ప‌నిసంస్కృతిపై కూడా చ‌ర్చించామ‌ని వెల్ల‌డించారు.

'ఈ ఉద‌యం సుంద‌ర్ పిచాయ్‌తో జ‌రిపిన చ‌ర్చ‌లు ఫ‌ల‌ప్ర‌దంగా ముగిసాయి. విస్తృత అంశాల‌పై ఇరువురం చ‌ర్చించుకున్నాం. ముఖ్యంగా దేశ రైతులు, యువ‌కులు, పారిశ్రామిక‌వేత్త‌ల జీవితాల‌ను మార్చ‌గ‌లిగే సాంకేతిక శ‌క్తిని పెంచే మార్గాల‌పై చ‌ర్చించాం. క్రీడ‌ల వంటి రంగాల‌పై ఈ మ‌హ‌మ్మారి వ‌ల్ల ఎదుర‌వుతున్న సవాళ్ల‌పై మాట్లాడుకున్నాం. స‌మాచార భ‌ద్ర‌త‌, సైబ‌ర్ సేఫ్టీ ప్రాముఖ్య‌తల గురించి మాట్లాడుకున్నాం' అని ప్ర‌ధాని ట్విట‌ర్లో పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా విద్య‌, అభ్యాసం, డిజిట‌లైజేష‌న్‌తోపాటు మ‌రెన్నో రంగాల్లో గూగుల్ చేస్తోన్న ప్ర‌యత్నాలను తెలుసుకోవ‌డం ఎంతో ఆనందంగా ఉందని ప్ర‌ధాని ట్విట‌ర్‌లో వెల్ల‌డించారు.

ప్ర‌ధాని ట్వీట్‌పై స్పందించిన పిచాయ్‌, డిజిట‌ల్ ఇండియా కోసం మీ ఆలోచన‌లు ఆశాజ‌న‌కంగా ఉన్నాయి. దానిలో పాలుపంచుకోవ‌డం చాలా సంతోషంగా ఉంద‌ని  బ‌దులిచ్చారు. ఆ ప్ర‌యాణంలో భాగంగా తాము చేప‌ట్టే త‌దుప‌రి అంశాల‌ను రాబోయేరోజుల్లో వెల్ల‌డిస్తామ‌ని తెలిపారు.

 Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని