close

తాజా వార్తలు

Published : 03/08/2020 10:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఐఫిల్‌ టవర్‌ కంటే ఎత్తైన రైలు వంతెన

చినాబ్‌ నదిపై నిర్మాణం

దిల్లీ: జమ్మూ-కశ్మీర్‌లో చినాబ్‌ నదిపై నిర్మిస్తున్న ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైలు వంతెన వచ్చే ఏడాదికల్లా సిద్ధమవుతుందని అధికారులు ఆదివారం తెలిపారు. డిసెంబర్‌-2022లో ఈ వంతెనపై తొలి రైలు పరుగులు తీస్తుందని, దీంతో కశ్మీర్‌ లోయకు దేశంలోని మిగిలిన ప్రాంతంతో తొలిసారిగా రైలు అనుసంధానం ఏర్పడుతుందని వివరించారు. ఈ వంతెన స్పాన్‌ పొడవు 467 మీటర్లు, భూమి నుంచి (నది అడుగు భాగం నుంచి) చూస్తే 359 మీటర్ల ఎత్తు ఉంటుంది. దిల్లీలోని కుతుబ్‌ మీనార్‌ ఎత్తు 72 మీటర్లు, ఐఫిల్‌ టవర్‌ ఎత్తు 324 మీటర్లు. చినాబ్‌ నదిపై నిర్మిస్తున్న ఈ రైలు వంతెన ఈ రెండింటి కంటే ఎత్తైనది. ‘‘ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెన. గంటకు 266 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినా తట్టుకుంటుంది’’ అని ఓ అధికారి చెప్పారు. ఏడాది కాలం నుంచి ఈ వంతెన పనులు వేగం పుంజుకున్నాయని, దిల్లీలోని ఉన్నతస్థాయి అధికారులు నేరుగా పర్యవేక్షిస్తున్నారని వివరించారు.  


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.