కొవిడ్‌తో ఊపిరితిత్తుల్లో నష్టం ఇలా.. !

తాజా వార్తలు

Updated : 24/08/2020 14:55 IST

కొవిడ్‌తో ఊపిరితిత్తుల్లో నష్టం ఇలా.. !

కళ్లకు కట్టిన వినూత్న చిత్రీకరణ విధానం

బెర్లిన్‌: తీవ్రస్థాయి కొవిడ్‌-19 వల్ల ఊపిరితిత్తుల్లో జరిగే నష్టాన్ని జర్మనీ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. దెబ్బతిన్న ఊపిరితిత్తుల కణజాలాన్ని చిత్రీకరించడానికి వీరు హై రిజల్యూషన్‌ ఇమేజింగ్‌తో కూడిన వినూత్న విధానాన్ని ఉపయోగించారు. ఈ మహమ్మారికి చికిత్స చేయడానికి కొత్త మార్గాలను కనుగొనడానికి ఈ పరిశోధన ఉపయోగపడుతుందని వారు చెప్పారు. గాటింగెన్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. వీరు ఒక వినూత్న ఎక్స్‌రే విధానాన్ని కనుగొన్నారు. ఇది కరోనా వైరస్‌తో ఇన్‌ఫెక్షన్‌కు గురైన ఊపిరితిత్తుల కణజాలాన్ని త్రీడీలో, అత్యధిక రిజల్యూషన్‌తో చిత్రీకరించడానికి వీలు కల్పించింది. ‘‘అంతర్గతంగా ఏం జరుగుతోందన్నది మనం స్పష్టంగా చూడటం వల్ల రోగి ఉపశమనానికి ఎలాంటి విధానాలు, ఔషధాలు ఉపయోగించాలన్న దానిపై స్పష్టత వస్తుంది’’ అని పరిశోధనలో పాలుపంచుకున్న డేనీ జోనిగ్‌ చెప్పారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని