close

తాజా వార్తలు

Published : 26/11/2020 07:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బాల్యంలోనే ఎయిడ్స్‌ ముప్పు

యునిసెఫ్‌ నివేదిక వెల్లడి

న్యూయార్క్‌: ప్రపంచానికి ఎయిడ్స్‌ బాధ ఇంకా తొలగలేదు. ప్రతి 100 సెకన్లకు ప్రపంచవ్యాప్తంగా ఒకరు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. వీరిలో 20 ఏళ్లలోపు యువకులు, పిల్లలే అధికం. గత ఏడాది 28 లక్షల మంది ఎయిడ్స్‌కు గురి కాగా, వారిలో 3.20 లక్షల మంది ఈ వయసు పిల్లలే ఉన్నారని యునిసెఫ్‌ నివేదిక వెల్లడించింది. వీరిలో 1.10 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. చిన్న పిల్లల్లో ఈ వ్యాధి రాకుండా చూడడం, వచ్చిన తరువాత నివారించడంపై అధిక ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో వ్యాధి నిరోధక చర్యలు అంత సంతృప్తికరంగా లేవని పేర్కొంది. ఉత్తర ఆఫ్రికా, మధ్యప్రాచ్యం దేశాల్లో వ్యాధి తీవ్రత అధికంగా కనిపిస్తోంది. కరోనాతో పాటు ఎయిడ్స్‌ కూడా ప్రపంచాన్ని వణికిస్తున్నట్టు యునిసెఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ హెన్నియెట్టా ఫోర్‌ తెలిపారు. ఎయిడ్స్‌ నివారణకు ఇంకా టీకా రాకపోవడంతో పిల్లలు ఎక్కువగా ప్రమాదానికి గురవుతున్నారని చెప్పారు. 10.30 లక్షల మంది గర్భిణులకు ఈ వ్యాధి సోకందని, దాంతో 68 వేల మంది పసిపాపలు పాలు తాగే దశలోనే ఎయిడ్స్‌ మహమ్మారి బారిన పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. 82 వేల మంది అయిదేళ్లలోపు పిల్లలు కూడా వ్యాధికి గురయ్యారు. కరోనా కారణంగా ఇలాంటి వారికి తగిన వైద్య సేవలు అందలేదని తెలిపారు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

మరిన్ని

దేవతార్చన