టీకా కోసం తొక్కిసలాట జరగొచ్చు:WHO

తాజా వార్తలు

Updated : 06/12/2020 12:47 IST

టీకా కోసం తొక్కిసలాట జరగొచ్చు:WHO

ఐక్యరాజ్యసమితి: కరోనా కథ ముగిసిందా? రాబోయే వ్యాక్సిన్లు ఈ మహమ్మారిని  భూ ప్రపంచం నుంచి పారదోలుతాయా? అంటే అవుననే అంటున్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ అధిపతి టెడ్రోస్‌ అథనామ్‌ గేబ్రియేసిస్‌. శుక్రవారం ఆయన ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ ఉన్నతస్థాయి సమావేశంలో మాట్లాడారు. వ్యాక్సిన్‌ ట్రయల్స్‌లో సానుకూల ఫలితాలు వస్తున్నాయని, ఇక కరోనా అంతమైందన్న కలలు కనొచ్చని పేర్కొన్నారు. టీకా కోసం భారీ తొక్కిసలాట జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇందులో బీద, అభివృద్ధి చెందుతున్న దేశాలు నలిగిపోయే ప్రమాదం ఉందన్నారు. టీకాను ప్రైవేటు సరకుగా కాకుండా ప్రజల ఆస్తిగా పరిగణించాలన్నారు. కొన్ని దేశాల్లో స్వప్రయోజనాల స్వార్థంతో కరోనా కేసులు పెరుగుతున్నట్టు టెడ్రోస్‌ పేర్కొన్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని