తేనె కల్తీ చైనా కంపెనీకి ఎరుకే

తాజా వార్తలు

Published : 09/12/2020 07:21 IST

తేనె కల్తీ చైనా కంపెనీకి ఎరుకే

మన దేశానికి సిరప్‌ విక్రయాలు అందుకే : సీఎస్‌ఈ

దిల్లీ: భారత్‌లో జరుగుతున్న తేనె కల్తీకి, తాము సరఫరా చేస్తున్న పాకానికి (సిరప్‌కు) సంబంధంలేదన్న చైనా కంపెనీ ‘వూహూ డలీ’ వాదనను శాస్త్ర, పర్యావరణ కేంద్రం (సీఎస్‌ఈ) మంగళవారం తోసిపుచ్చింది. భారత్‌లో తనిఖీ సంస్థల పరీక్షలకు దొరకకుండా ఆయా బ్రాండ్ల తేనెలు ఆమోదం పొందేందుకు తమ కంపెనీ సిరప్‌ ఉపయోగపడుతుందని, ఈ విషయం తెలిసే ఉద్దేశపూర్వకంగా తాము దానిని పెద్ద మొత్తంలో విక్రయిస్తున్నామంటూ సీఎస్‌ఈ చేసిన ఆరోపణలను చైనా కంపెనీ ఖండించింది. అయితే, వూహూ డలీ వాదనలో వాస్తవం లేదంటూ తమ శోధనలో తేలిన అంశాలను సీఎస్‌ఈ వివరించింది. తేనె వ్యాపార కంపెనీగా పేర్కొంటూ తమ పరిశోధకులు వూహూ డలీతో పాటు మరికొన్ని చైనా కంపెనీలను సంప్రదించారని, భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ(ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) తనిఖీలకు(సీ3, సీ4, ఎస్‌ఎంఆర్‌, టీఎంఆర్‌ తదితర పరీక్షలకు) దొరకని విధంగా మిశ్రమంగా కలపటానికి ఉపయోగపడే సిరప్‌ కావాలని కోరగా అందుకు సమ్మతించారని సీఎస్‌ఈ తెలిపింది. తమ ఫ్రక్టోజ్‌ సిరప్‌ భారత్‌లోని అన్ని పరీక్షలను తప్పించుకోగలదని వూహూ డలీ ఆ సందర్భంగా హామీ ఇచ్చిందని పేర్కొంది. అయితే, తమకు ఆహార ఉత్పత్తులను దిగుమతి చేసుకొనే లైసెన్సు లేనందున సిరప్‌ ఆర్డర్‌ను రద్దు చేసుకోవాల్సి వచ్చిందని వివరించింది. ఆన్‌లైన్‌ మార్కెట్‌ వేదికలపై సిరప్‌ను పలు చైనా కంపెనీలు విక్రయిస్తున్న విషయాన్ని సీఎస్‌ఈ ఈ సందర్భంగా గుర్తుచేసింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని