close

తాజా వార్తలు

Updated : 18/01/2021 11:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కరోనా సమయంలో నా భార్యకు ముద్దు కూడా పెట్టలేదు

నవ్వులు పూయించిన ఫరూక్‌ అబ్దుల్లా

జమ్మూ: కరోనా సమయంలో తన భార్యకు ముద్దు కూడా పెట్టలేదని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ అధినేత ఫరూక్‌ అబ్దుల్లా అన్నారు. ఓ పుస్తక కార్యక్రమంలో పాల్గొనేందుకు జమ్మూ వచ్చిన అబ్దుల్లా.. తన 35 నిమిషాల ప్రసంగంలో నవ్వులు పూయించారు. కరోనా.. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిందని అన్నారు. తానూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని వివరించారు. ‘‘ఎదుటి వ్యక్తితో చేతులు కలపడానికి భయమేస్తోంది. ఆలింగనం చేసుకోడానికి భయమేస్తోంది. నిజాయతీగా చెబుతున్నా.. నేనైతే నా భార్యకు ముద్దు కూడా పెట్టలేదు, ఏమో ఏం జరుగుతోందో ఎవరికి తెలుసు. ఇక కౌగిలింత ప్రసక్తే లేదు. మనసెంత కోరుకున్నా సరే’’ అని అన్నారు. కొవిడ్‌-19 టీకాలు వచ్చినందుకు ఆనందం వ్యక్తం చేసిన అబ్దుల్లా.. త్వరలోనే ఈ మహమ్మారి పీడ విరగడవ్వాలని అందరూ దేవుడిని ప్రార్థించాలని కోరారు.   
 



Tags :

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని