close

తాజా వార్తలు

Published : 02/03/2021 01:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అక్కడ పట్టు సాధించాలి.. ఇక్కడ నిలబెట్టుకోవాలి

కేరళ, బెంగాల్‌లపై వామపక్షాల దృష్టి 

దిల్లీ: శాసనసభ ఎన్నికల నగారా మోగిన రాష్ట్రాల్లో కేరళ, పశ్చిమ బెంగాల్‌లపై వామపక్షాలు ప్రత్యేక దృష్టి సారించాయి. మిత్రపక్షాలతో కలిసి కేరళలో అధికారాన్ని నిలబెట్టుకోవాలని, బెంగాల్‌లో పూర్వవైభవాన్ని తిరిగి సంపాదించుకోవాలని భావిస్తున్నాయి. ఈ రెండు చోట్లా వామపక్షాల అవకాశాలను ప్రభావితం చేయగల స్థాయిలో కాంగ్రెస్‌ ఉంది. కేరళలో సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్‌ కూటమికి ప్రత్యర్థిగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీ అటు బెంగాల్‌లో మాత్రం వామపక్షాలతో కలిసి పనిచేస్తోంది. దీంతో కొన్ని అంశాల్లో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. బెంగాల్‌లో వామపక్ష నేతలతో కలిసి ఒకే వేదికపై కూర్చొనేందుకు కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంక ఇష్టపడడం లేదు. కేరళలో కూటమికి దెబ్బతగలకూడదనేది వారి ఉద్దేశం. కోల్‌కతాలో ఆదివారం నాటి మెగా ర్యాలీకి కూడా వారు అందుకే హాజరు కాలేదని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. 

రెండింటినీ ఓడించాలని..: 2016లో బెంగాల్‌లో కాంగ్రెస్‌తో కలిసి పోటీచేసిన కమ్యూనిస్ట్‌ పార్టీలు ఓటమి చవిచూశాయి. అయితే 38% ఓట్లు సాధించాయి. అధికార తృణమూల్‌ కంటే ఇది 7% తక్కువ. ఈసారి కూడా అక్కడ కలిసే పోటీ చేయాలని కాంగ్రెస్‌-లెఫ్ట్‌ నిర్ణయించుకున్నాయి. అటు భాజపాని, ఇటు తృణమూల్‌ కాంగ్రెస్‌ని ఓడించాలనే ఏకైక లక్ష్యంతో కీలకమైన ఈ ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నట్లు సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చెబుతున్నారు. తృణమూల్‌ సర్కారుపై ఉన్న వ్యతిరేకత భాజపాకి లాభించే అవకాశం ఉందని, అందువల్ల ఆ రెండు పార్టీలనూ ఓడించాల్సి ఉందని ఆయన చెప్పారు. తృణమూల్‌ కంటే భాజపాయే పెద్ద శత్రువు అనీ, ఈ విషయమై సీపీఎంని ఒప్పించలేక తాము ఒంటరిగా బరిలో దిగామని సీపీఐ (ఎంఎల్‌) ప్రకటించింది. ఈసారి బెంగాల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌-వామపక్ష కూటమిలో ఇండియన్‌ సెక్యులర్‌ ఫ్రంట్‌ (ఐఎస్‌ఎఫ్‌) కూడా చేరబోతోంది. ముస్లిం ఓట్లను రాబట్టడంలో ఐఎస్‌ఎఫ్‌ దోహదపడుతుందని భావిస్తున్నారు. గట్టి పోటీ ఉండే దాదాపు 100-110 నియోజకవర్గాల్లో ఈ ఓట్లే గెలుపు-ఓటముల్ని నిర్ణయించనున్నాయి. బెంగాల్‌ జనాభాలో 30% వరకు ముస్లింలు ఉన్నారు. 



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని