ఎవర్‌ గివెన్‌ కథేంటి?ఎలా అడ్డం తిరిగింది?

తాజా వార్తలు

Updated : 28/03/2021 15:48 IST

ఎవర్‌ గివెన్‌ కథేంటి?ఎలా అడ్డం తిరిగింది?

సూయిజ్‌ కాలువ: మధ్యధరా, హిందూ మహాసముద్రాలను కలుపుతూ ఈజిప్టులో కృత్రిమంగా నిర్మించారు. 1869లో ఇది ప్రారంభమైంది. దీని పొడవు 193 మీటర్లు. వెడల్పు సుమారు 200 మీటర్లు. ప్రపంచ వాణిజ్యంలో సుమారు 10-12% ఈ కాలువ మీదుగా నౌకల ద్వారా సాగుతుంది. రోజూ 50కి పైగా ఓడలు దీని గుండా ప్రయాణిస్తాయి.
సమస్య ఎలా వచ్చింది?
ఈనెల 23న సూయిజ్‌ కాలువ దక్షిణ ద్వారం నుంచి 3.7 మైళ్లు ప్రయాణించిన తర్వాత ఇసుక తుపాను, తీవ్ర గాలుల ధాటికి ‘ఎవర్‌ గివెన్‌’ నియంత్రణ కోల్పోయి, అడ్డంగా తిరిగింది. నౌక ముందు భాగం కాలువ అంచున ఉన్న ఇసుక, బంకమట్టిలో కూరుకుపోయింది.
ఏంటీ భారీ నౌక? 
జపాన్‌లోని ‘షోయి కిసెన్‌ కైసా’ సంస్థకు చెందిన భారీ సరకు రవాణా నౌక ఇది. పేరు ‘ఎంవీ ఎవర్‌ గివెన్‌. దీన్ని తైవాన్‌కు చెందిన ‘ఎవర్‌ గ్రీన్‌’ సంస్థ నిర్వహిస్తోంది.
పొడవు: 400 మీటర్లు 
వెడల్పు: 59 మీటర్లు 
బరువు: 2,19,076 టన్నులు
వేగం: 22.8 నాటికల్‌ మైళ్లు
 ప్రారంభం: 2018లో
ఇందులో సిబ్బంది: 25 మంది. అందరూ భారతీయులే
పరిష్కారమేంటి?
1 నౌక ముందు భాగాన్ని మరో నౌకతో పక్కకు లాగడం. 
2 ఓడ చిక్కుకున్న ఇసుకను తొలగించి, కదిలేందుకు వీలు కల్పించడం. 
3 అందులోని కంటైనర్లను తొలగించి, తేలికపరచడం.
4 టగ్‌ బోట్ల ద్వారా వెనుక నుంచి లాగడం. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని