అంత్యక్రియలు జరిగిన 3 నెలలకు తిరిగొచ్చాడు!
close

తాజా వార్తలు

Published : 30/03/2021 11:45 IST

అంత్యక్రియలు జరిగిన 3 నెలలకు తిరిగొచ్చాడు!

పతనంతిట్ట: మృతిచెందాడను కొని అంత్యక్రియలు కూడా చేసేశారు..మూడు నెలలు గడిచిపోయింది. ఇంతలో ఆ వ్యక్తి నిక్షేపంగా కళ్లెదుట ప్రత్యక్షమయ్యాడు.  ఈ ఘటన కేరళ రాష్ట్రం పతనంతిట్ట జిల్లాలోని కుదస్సనాడులో జరిగింది. సాబూ.. తిరువనంతపురంలో క్యాటరింగ్, బస్‌ క్లీనింగ్‌ వంటి ఉద్యోగాలు చేసేవాడు. చిన్న చిన్న చోరీలు చేసే అలవాటూ ఉంది. తను పనిచేసే హోటల్‌లో డబ్బు దొంగతనం జరగ్గా ఆ కేసులో పోలీసులు సాబూను గతేడాది నవంబరులో అరెస్టు చేశారు. ఆ తర్వాత అతని గురించి కుటుంబ సభ్యులకు ఎలాంటి సమాచారం లేదు. డిసెంబర్‌ 24న కొట్టాయం జిల్లా పాలా పోలీసు స్టేషన్‌ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మరణించాడు. తిరువనంతపురం పోలీసులు ఆ మృతదేహం సాబూదేనన్న అనుమానంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆ దేహం సాబూదేనని పొరపాటు పడిన కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. శుక్రవారం ఒక బస్‌ డ్రైవర్‌కు సాబూ తటస్థపడ్డాడు. సాబూను గుర్తుపట్టిన డ్రైవర్‌ సమాచారాన్ని పోలీసులకు, కుటుంబ సభ్యులకూ తెలియజేశారు. పోలీసులు...గత డిసెంబర్‌లో అంత్యక్రియలు జరిపిన మృతదేహం ఎవరిదో తెలుసుకునే పనిలో పడ్డారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని