9 కిలోల బుల్లెట్‌ప్రూఫ్‌ జాకెట్‌

తాజా వార్తలు

Updated : 02/04/2021 09:26 IST

9 కిలోల బుల్లెట్‌ప్రూఫ్‌ జాకెట్‌

నాణ్యత, తక్కువ బరువుతో డీఆర్డీవో తయారీ

ఈనాడు- దిల్లీ, ఈనాడు డిజిటల్‌- బెంగళూరు: తక్కువ బరువుతో ఉండే బుల్లెట్‌ప్రూఫ్‌ జాకెట్‌ను రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) ఆధ్వర్యంలోని ప్రయోగశాలలో రూపొందించారు. భారత సైన్యం అవసరాలకు తగిన నాణ్యతతో ఉండేలా కాన్పూర్‌లోని డీఆర్డీవో ప్రయోగశాల డిఫెన్స్‌ మెటీరియల్స్‌ అండ్‌ స్టోర్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ (డీఎంఎస్‌ఆర్డీఈ) దీన్ని రూపొందించింది. ఎఫ్‌హెచ్‌ఏపీ (ఫ్రంట్‌హార్డ్‌ ఆర్మెర్‌ ప్యానెల్‌) జాకెట్‌గా పిలిచే వీటిని చండీగఢ్‌లోని టెర్మినల్‌ బాలిస్టిక్‌ రీసెర్చ్‌ లేబొరేటరీలో పరీక్షించి నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నట్లు తేల్చారు. ప్రత్యేకమైన లోహాలు, అధునాతన సాంకేతిక వినియోగంతో గతంలో 10.4 కిలోలుండే జాకెట్‌ బరువు ఇప్పుడు 9 కిలోలకు తగ్గింది. ఆత్మనిర్భర్‌ భారత్‌ ద్వారా ఇలాంటి మరిన్ని ఉత్పత్తులను ఆవిష్కరిస్తే రక్షణ రంగం మరింత శక్తిమంతం కాగలదని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అభిప్రాయపడ్డారు. డీఎంఎస్‌ఆర్‌డీసీ బృందాన్ని డీఆర్‌డీఓ ఛైర్మన్‌ డా.జి.సతీశ్‌రెడ్డి అభినందించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని