close

తాజా వార్తలు

Updated : 12/04/2021 19:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా సుశీల్‌చంద్ర

దిల్లీ: కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ)గా సుశీల్‌చంద్ర నియమితులయ్యారు. ప్రస్తుత సీఈసీ సునీల్‌ ఆరోడా పదవీకాలం నేటితో ముగిసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘంలో కమిషనర్‌గా ఉన్న సుశీల్‌ చంద్రను కొత్త సీఈసీగా కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. సుశీల్‌ చంద్ర సీఈసీగా రేపు బాధ్యతలు చేపట్టనున్నారు. వచ్చే ఏడాది మే 14 తేదీ వరకు ఆయన ఆ పదవిలో కొనసాగనున్నారు.

కేంద్ర ఎన్నికల సంఘంలోని కమిషనర్లలో సీనియర్‌ను ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా నియమించడం ఆనవాయితీగా వస్తోంది. సుశీల్‌ చంద్ర నేతృత్వంలోనే గోవా, మణిపుర్‌, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల సంఘం కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టడానికి ముందు సుశీల్‌ చంద్ర కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి ఛైర్మన్‌గా ఉన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని