close

తాజా వార్తలు

Updated : 19/04/2021 08:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఇక oxygen express

దిల్లీ :  కొద్ది రోజుల్లో ‘ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌’ను నడపనున్నట్లు రైల్వేశాఖ ఆదివారం తెలిపింది. మెడికల్‌ ఆక్సిజన్‌కు డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో ఈ రైలు ద్వారా డిమాండ్‌ ఉన్నచోటుకు ఆక్సిజన్‌ను సరఫరా చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపారు. ఖాళీ ట్యాంకర్లు ముంబయి సమీపం నుంచి సోమవారం బయల్దేరి వైజాగ్‌, జంషెడ్‌పుర్‌, రవుర్కెలా, బొకారోల నుంచి ద్రవ రూప ఆక్సిజన్‌ను నింపుతాయని చెప్పారు.
* గతేడాది కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు తమ పరిధిలోని ఆసుపత్రుల్లో కొవిడ్‌ పడకలు ఏర్పాటు చేసిన విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈసారీ అదే తరహా సాయం అందించాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ వివిధ శాఖలను కోరారు. ఈ మేరకు రక్షణ, రైల్వే, ఉక్కు, బొగ్గు, విద్యుత్తు, నౌకాయానం, విద్యాశాఖ కార్యదర్శులకు లేఖలు రాశారు. వీలైనచోట్ల ఆక్సిజన్‌, ఐసీయూ బెడ్లు, వెంటిలేటర్లు, లేబొరేటరీ సేవలు అందుబాటులోకి తేవాలని కోరారు.
* బిహార్‌లో రాత్రి 9 నుంచి ఉదయం 5 వరకు కర్ఫ్యూ ఉంటుందని ముఖ్యమంత్రి నీతిశ్‌ కుమార్‌ ప్రకటించారు. విద్యాసంస్థల మూసివేతను మే 15 వరకు పొడిగించారు.
* కొవిడ్‌ టీకాలు, మందులు, ఆక్సిజన్‌ను రాష్ట్రానికి తగినంతగా సరఫరా చేయాలని కోరుతూ పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని నరేంద్ర మోదీకి ఆదివారం లేఖ రాశారు.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని