Vaccineతో 96% రక్షణ! 

తాజా వార్తలు

Updated : 08/05/2021 12:41 IST

Vaccineతో 96% రక్షణ! 

అమెరికా శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడి

దిల్లీ: కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నవారికి ఆ ఇన్‌ఫెక్షన్‌ నుంచి 96% రక్షణ లభిస్తోందని... ఒకవేళ కరోనా సోకినా, ఇన్‌ఫెక్షన్‌ తీవ్రత స్వల్పంగానే ఉంటోందని తాజా పరిశోధనలో రూఢి అయింది. అమెరికాలో ఫైజర్‌-బయోఎన్‌టెక్‌ వ్యాక్సిన్‌ వేయించుకున్న తమ సిబ్బందిపై సెయింట్‌ జ్యూడ్‌ చిల్డ్రన్‌ రీసెర్చ్‌ ఆసుపత్రి శాస్త్రవేత్తలు ఇటీవల అధ్యయనం సాగించారు. గత డిసెంబరు నుంచి ఈ ఏడాది మార్చి వరకూ... మొత్తం 5,217 మంది ఈ క్రతువులో పాలుపంచుకున్నారు. వీరిలో 58% మంది ఫైజర్‌-బయోఎన్‌టెక్‌ టీకా తీసుకున్నవారు ఉన్నారు. అధ్యయన సమయంలో మొత్తం 236 మంది కొవిడ్‌కు గురికాగా, వారిలో 185 మంది ఎలాంటి వ్యాక్సిన్‌ తీసుకోనివారే ఉన్నారు.

‘‘వ్యాక్సిన్‌ తీసుకున్నవారికి వైరస్‌ సోకినా... లక్షణాలు కనిపించే, కనిపించని ఇన్‌ఫెక్షన్ల తీవ్రత సగటున 79% తక్కువగా ఉంటున్నాయి. రెండో డోసు తీసుకున్న తర్వాత కనీసం వారం రోజులకు కొవిడ్‌ నుంచి 96% రక్షణ లభిస్తోంది. టీకా వేయించుకున్న వారి నుంచి ఇతరులకు కొవిడ్‌ సోకే ముప్పు కూడా తక్కువే. దీనిపై మరింత లోతైన పరిశోధన జరగాల్సి ఉంది’’ అని శాస్త్రవేత్త డీగో హిజానో తెలిపారు. అమెరికన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ జర్నల్‌ ఈ వివరాలను అందించింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని