కంటిచూపు కోల్పోతున్న బ్లాక్‌ఫంగస్‌ బాధితులు   
close

తాజా వార్తలు

Updated : 09/05/2021 09:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కంటిచూపు కోల్పోతున్న బ్లాక్‌ఫంగస్‌ బాధితులు   

మహారాష్ట్ర, గుజరాత్‌లో వెలుగు చూస్తున్న కేసులు 

అహ్మదాబాద్‌/ ముంబయి: మహారాష్ట్ర, గుజరాత్‌లలో కొవిడ్‌-19 నుంచి కోలుకున్నవారిలో ‘బ్లాక్‌ ఫంగస్‌’ (మ్యూకోర్‌మైకోసిస్‌) ఇన్‌ఫెక్షన్‌ కేసులు పెరుగుతున్నాయని వైద్యులు, అధికారులు శనివారం తెలిపారు. దీనివల్ల కొందరు బాధితులు కంటిచూపును కోల్పోతున్నారని తెలిపారు. ఈ ఇన్‌ఫెక్షన్‌ను నయం చేయడానికి అవుతున్న ఖర్చు కూడా ఆందోళన కలిగిస్తోందని చెప్పారు. మూడు వారాల కిందట కరోనా నుంచి కోలుకున్న ఒక వ్యక్తిలో ఈ ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ను గుర్తించామని సూరత్‌కు చెందిన ఒక ఆసుపత్రి అధిపతి మాథుర్‌ సవాని చెప్పారు. ‘‘ఇప్పుడు మా ఆసుపత్రిలో ఈ కేసులు సంఖ్య 50కి పెరిగిపోయింది. మరో 60 మంది చికిత్స కోసం ఎదురుచూస్తున్నారు’’ అని ఆయన తెలిపారు. ఈ సమస్యతో సూరత్, గుజరాత్‌లోని ఇతర ప్రాంతాల నుంచి బాధితులు తమ ఆసుపత్రికి వస్తున్నారని చెప్పారు. వీరంతా కొవిడ్‌ నుంచి ఇటీవల కోలుకున్నవారేనని తెలిపారు. బాధితుల్లో ఏడుగురు కంటి చూపును కోల్పోయారని పేర్కొన్నారు. ఈ ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సూరత్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వైద్యాధికారి కేతన్‌ నాయక్‌ చెప్పారు. మహారాష్ట్రలో ఈ ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్ల వల్ల కనీసం 8 మంది దృష్టిని కోల్పోయారని రాష్ట్ర వైద్య విద్య, పరిశోధన డైరెక్టరేట్‌ అధిపతి తాత్యారావు లహానే చెప్పారు. ‘‘వారు కొవిడ్‌పై విజయం సాధించారు. కానీ వారిలోని బలహీనమైన రోగ నిరోధక వ్యవస్థపై ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ దాడి చేసింది’’ అని తెలిపారు.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని