WHO: లెక్కకు రాని మరణాలు 12 లక్షలు 

తాజా వార్తలు

Updated : 22/05/2021 11:05 IST

WHO: లెక్కకు రాని మరణాలు 12 లక్షలు 

2020 కరోనా సంక్షోభానికి సంబంధించి డబ్ల్యూహెచ్‌వో అంచనా 

ఐరాస: కొవిడ్‌ మరణాలకు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తాజాగా ఓ ఆందోళనకర విషయాన్ని బయటపెట్టింది. మృతుల గణన నిర్దుష్టంగా సాగడం లేదని తెలిపింది. గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా కనీసం 30 లక్షల మందిని కరోనా మహమ్మారి బలి తీసుకొని ఉండొచ్చని అంచనా వేసింది. ఆయా దేశాలు అధికారికంగా వెల్లడించిన మరణాలతో (18 లక్షలు) పోలిస్తే ఈ సంఖ్య చాలా ఎక్కువ అని తెలిపింది. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య గణాంకాల పేరుతో ప్రత్యేక నివేదికను డబ్ల్యూహెచ్‌వో శుక్రవారం విడుదల చేసింది. తాజా నివేదిక ప్రకారం.. 2020 డిసెంబరు 31 నాటికి ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 8.2 కోట్లు, మృతుల సంఖ్య 18 లక్షలుగా ఉందని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. వాస్తవానికి అంతకంటే కనీసం 12 లక్షల మరణాలు అధికంగా సంభవించి ఉండొచ్చు. చాలా దేశాల్లో.. కరోనా బారిన పడి ఆస్పత్రుల్లో మరణించినవారిని, పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాక మృతిచెందినవారినే లెక్కించారు. వ్యాధి నిర్ధారణ సరిగా జరగకముందే కన్నుమూసినవారిని లెక్కల్లోకి తీసుకోలేదు. కొవిడ్‌ సంక్షోభం పరోక్షంగా కూడా చాలా మరణాలకు దారితీసింది. వాటినీ గణించలేదు. ఆదాయం, వయసు, జాతి తదితర అంశాల ప్రాతిపదికన సమాజంలో అసమానతలు ఇంకా ఉన్నాయని మహమ్మారి ఎత్తిచూపింది. మరోవైపు- అన్ని దేశాలూ డేటా సేకరణ సామర్థ్యాలను మెరుగుపర్చుకోవాల్సిన ఆవశ్యకతను కొవిడ్‌ నొక్కి చెప్పిందని డబ్ల్యూహెచ్‌వో అధినేత టెడ్రోస్‌ అధనోమ్‌ పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని