Vaacine: టీకా వేసుకుంటేనే జీతం

తాజా వార్తలు

Updated : 03/06/2021 11:20 IST

Vaacine: టీకా వేసుకుంటేనే జీతం

ప్రభుత్వ ఉద్యోగులకు ఫిరోజాబాద్‌ కలెక్టర్‌ హుకుం

ఫిరోజాబాద్‌: కరోనా టీకా కార్యక్రమాన్ని వేగవంతం చేయడంతో పాటు దానిని ప్రోత్సహించడం కోసం ప్రభుత్వ ఉద్యోగులకు ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌ కలెక్టర్‌ కొత్త నిబంధన విధించారు. టీకాలు వేయించుకున్న వారికే జీతాలు చెల్లిస్తామని, లేకుంటే నిలిపివేస్తామంటూ కలెక్టర్‌ చంద్ర విజయ్‌ సింగ్‌ మౌఖిక ఆదేశాలు జారీ చేశారని చీఫ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ చర్చిత్‌ గౌర్‌ వెల్లడించారు. ఈ ఉత్తర్వులకు అనుగుణంగానే అన్ని విభాగాల ఉన్నతాధికారులు, జిల్లా ట్రెజరీ కార్యాలయానికి మార్గదర్శకాలు వెళ్లాయని తెలిపారు. టీకా వేసుకున్న వారి జాబితాలో పేర్లున్న ఉద్యోగులకు మాత్రమే జీతాలు చెల్లించనున్నారు. దీంతో టీకా పొందేందుకు ఉద్యోగులు పరుగులు తీస్తున్నారని చర్చిత్‌ గౌర్‌ పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని