Corona: జులై నెలాఖరుకు కరోనా తగ్గుముఖం?

తాజా వార్తలు

Updated : 03/06/2021 11:08 IST

Corona: జులై నెలాఖరుకు కరోనా తగ్గుముఖం?

       నాలుగు రాష్ట్రాల్లో తగ్గేందుకు అవకాశం

ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడి

ఈనాడు, అమరావతి: దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో జులై నెలాఖరుకు కరోనా సెకండ్‌వేవ్‌ ఉద్ధృతి తగ్గే అవకాశముందని అమరావతిలోని ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ అధ్యయనంలో తెలిసింది. ఎనిమిది రాష్ట్రాల్లో సెకండ్‌వేవ్‌ ఎప్పటికి తగ్గుతుందన్న అంశంపై యూనివర్సిటీ ప్రో వైస్‌ఛాన్స్‌లర్‌ డి.నారాయణరావు పర్యవేక్షణలోని బృందం అధ్యయనం చేసింది. ఆ వివరాల్ని నారాయణరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా వాడుకలో ఉన్న ఎస్‌ఐఆర్‌ (సస్పెక్టబుల్, ఇన్ఫెక్టెడ్, రికవరీ) మోడల్‌ సాయంతో, ర్యాండమ్‌ ఫారెస్ట్‌ మెషీన్‌ లెర్నింగ్‌ అల్గరిథమ్‌ డేటాను తమ బృందం తయారుచేసిందని, అది వైరస్‌ వ్యాప్తి, వేగం, తీవ్రతతో పాటు, రికవరీని అంచనా వేస్తుందని ఆయన వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, దిల్లీ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్‌లో రోజువారీ కేసుల వివరాల్ని తీసుకుని, ఎస్‌ఐఆర్‌ విధానంలో ఎప్పటికి తగ్గుతుందో అంచనా వేసినట్టు తెలిపారు. ఉత్తర్‌ప్రదేశ్, దిల్లీల్లో తమ అంచనాలకు రెండు మూడు రోజులు అటూ ఇటూగా కొవిడ్‌ తగ్గుముఖం పట్టిందని ఆయన వెల్లడించారు. అధ్యయన బృందంలో భౌతికశాస్త్ర ఆచార్యులు సౌమ్యజ్యోతి బిశ్వాస్, కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థులు అన్వేష్‌రెడ్డి, హనేష్, సుహారెడ్డి, సాయికృష్ణ ఉన్నారు.

ఎస్‌ఆర్‌ఎం అధ్యయనం ప్రకారం..

 కర్ణాటకలో జులై 1కి ఆరు రోజుల ముందు లేదా ఐదు రోజుల తర్వాత తగ్గుతుంది.

•  మహారాష్ట్రలో జులై 13కి తగ్గొచ్చు. అక్కడి పరిస్థితుల దృష్ట్యా ఈ తేదీకి వారం ముందుగానీ, వారం తర్వాతగానీ తగ్గే అవకాశం ఉంది.

•  ఆంధ్రప్రదేశ్‌లో జులై 16 నాటికి తగ్గే సూచనలున్నాయి. పరిస్థితులు అనుకూలించి, ప్రజలు జాగ్రత్తలు పాటిస్తే 16 రోజుల ముందే కరోనా వ్యాప్తి ఆగుతుంది. లేకపోతే 28 రోజుల తర్వాత సాధ్యపడుతుంది.

 తమిళనాడులో జులై 26కి తగ్గుతుంది.

 కేరళలో ఆగస్టు 12కి, పశ్చిమబెంగాల్‌లో సెప్టెంబరు 2 నాటికి ఉద్ధృతి తగ్గే అవకాశముంది.

• తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్‌లో భారీ జనసందోహాలతో కార్యక్రమాలు నిర్వహించడం వల్ల కొవిడ్‌ తగ్గడంలో కొంత జాప్యం జరగవచ్చునని నారాయణరావు పేర్కొన్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని