China: సైన్యాన్ని అవమానిస్తే కుదరదు
close

తాజా వార్తలు

Published : 12/06/2021 14:56 IST

China: సైన్యాన్ని అవమానిస్తే కుదరదు

కొత్త చట్టాన్ని తెచ్చిన చైనా

బీజింగ్‌: సైనిక దళాల సభ్యుల పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించేలా వ్యవహరించేవారిపై ఉక్కుపాదం మోపడానికి చైనా ఓ కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఇప్పటికే అమలులో ఉన్న 2018 నాటి అమరవీరుల గౌరవ పరిరక్షణ చట్టానికి మరింత పదును పెడుతూ దీన్ని రూపొందించింది. కొత్త చట్టం ప్రకారం ఏ సంస్థ కానీ, వ్యక్తి కానీ ఏ విధంగానూ సైనికులను కించపరడం, వారి గౌరవానికి భంగం కలిగించడం చేయకూడదు. సైనిక సిబ్బంది గౌరవార్థం ఏర్పాటు చేసిన ఫలకాలను అపవిత్రం చేయకూడదు. సైనిక సిబ్బందిని అవమానించడం, వారి హక్కులకు భంగం కలిగించడం లాంటి సంఘటనలపై న్యాయవాదులు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేయొచ్చు. దోషులుగా తేలినవారికి కఠిన శిక్షలు అమలు చేస్తారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని