ప్రత్యర్థుల ఫోన్లపై ట్రంప్‌ నిఘా
close

తాజా వార్తలు

Updated : 13/06/2021 06:41 IST

ప్రత్యర్థుల ఫోన్లపై ట్రంప్‌ నిఘా

నాటి వ్యవహారంపై దర్యాప్తు

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన అక్రమాలపై దర్యాప్తు చేయనున్నట్టు శుక్రవారం న్యాయవిభాగం తెలిపింది. వ్యక్తిగత కారణాలతో ఆయన తన రాజకీయ ప్రత్యర్థులపై నిఘా ఉంచారని, వారిని శిక్షించడానికి కూడా వెనకాడలేదని పేర్కొంది. అధ్యక్ష ఎన్నికల్లో రష్యా సహకారం పొందారంటూ ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఈ విషయమై ఆరోపణలు చేసిన డెమొక్రాటిక్‌ పార్టీకి చెందిన చట్టసభ సభ్యులు ఆడం షిఫ్‌, ఎరిక్‌ స్వాల్‌వెల్‌ల ఐ-ఫోన్ల నుంచి ట్రంప్‌ రహస్యంగా సమాచారం సేకరించారు. ఇందుకు అప్పటి న్యాయవిభాగం అధికారులతో పాటు, ఆపిల్‌ కంపెనీ కూడా సహకరించింది. వారి కుటుంబ సభ్యుల స్మార్ట్‌ ఫోన్ల నుంచి సమాచారాన్ని కూడా అక్రమంగా సంపాదించారు. మరో 12 మంది నాయకుల ఫోన్ల వివరాలను కూడా ఆపిల్‌ కంపెనీ అందజేసింది. వ్యక్తిగత అవసరాల కోసం అధికారాన్ని దుర్వినియోగం చేశారని విమర్శలు రావడంతో ప్రస్తుత ప్రభుత్వం దర్యాప్తు చేయిస్తోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని