Ventilator: జేబులో పట్టే వెంటిలేటర్‌
close

తాజా వార్తలు

Updated : 14/06/2021 11:18 IST

Ventilator: జేబులో పట్టే వెంటిలేటర్‌

కోల్‌కతాకు చెందిన రామేంద్ర లాల్‌ ముఖర్జీ అనే ఎలక్ట్రానిక్‌ ఇంజినీర్‌.. కరోనాతో శ్వాస సమస్యలు ఎదుర్కొనే రోగుల కోసం ‘పాకెట్‌ వెంటిలేటర్‌’ తయారు చేశారు. దీని సాయంతో పూర్తిస్థాయి వైద్యం అందేలోపు రోగి ప్రాణాలను నిలబెట్టుకోవచ్చని చెబుతున్నారు. కొన్నిరోజుల క్రితం ఆయన కరోనా బారినపడ్డారు. తీవ్రమైన శ్వాస ఇబ్బందులు ఎదుర్కొని ఎట్టకేలకు కోలుకున్నారు. తాను అనుభవించిన బాధలు మరెవరికీ కలగకూడదని నిర్ణయించుకున్నారు. ఇంజినీర్‌గా తనకున్న పరిజ్ఞానంతో ‘పాకెట్‌ వెంటిలేటర్‌’ అనే వినూత్న పరికరాన్ని రూపొందించారు. దీని సాయంతో ఆక్సిజన్‌ అందక ఇబ్బంది పడే రోగులకు మేలు కలుగుతుందని, ఆస్పత్రికి వెళ్లేవరకు రోగి ప్రాణాలను కాపాడుకోవచ్చని తెలిపారు. దీని ధర కూడా చాలా తక్కువేనని అన్నారాయన. దీనిలో రెండు భాగాలు ఉంటాయి. మొదటిది బ్యాటరీ యూనిట్, రెండోది మాస్క్‌కు జోడించి ఉన్న వెంటిలేటర్‌. ఈ పరికరానికి పేటెంట్‌ కోసం దరఖాస్తు చేసుకున్నట్టు రామేంద్ర చెప్పారు. 



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని