బిగ్‌ ఫ్యామిలీ మ్యాన్‌.. బతికే ఉన్నారు!
close

తాజా వార్తలు

Updated : 15/06/2021 15:08 IST

బిగ్‌ ఫ్యామిలీ మ్యాన్‌.. బతికే ఉన్నారు!

మరణించలేదంటున్న కుటుంబీకులు


ఆయ్‌జోల్‌: ప్రపంచంలోనే అతిపెద్ద కుటుంబానికి యజమానిగా పేరుగాంచిన జియోన (76) ఆదివారమే మరణించినా.. ఆయన ఇంకా బతికే ఉన్నారని కుటుంబ సభ్యులు విశ్వసిస్తున్నారు! బతికుండగా ఆయనకు అంతిమ సంస్కారాలు కూడా నిర్వహించలేమని తెగేసి చెబుతున్నారు. మిజోరంలోని బక్తావంగ్‌ గ్రామానికి చెందిన జియోనకు 39 మంది భార్యలు, 90 మందికి పైగా పిల్లలు, కనీసం 33 మంది మనవలు, మనవరాళ్లు ఉన్నారు. అనారోగ్యంతో ఆయన మరణించినట్లు వైద్యులు ఆదివారం ప్రకటించారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన భౌతిక కాయాన్ని ఇంటికి తీసుకొచ్చారు. అయితే ఇంటికి వచ్చాక జియోన శరీరం కాస్త వెచ్చగా మారిందని కుటుంబ  సభ్యులు చెబుతున్నారు. పల్స్‌ బీట్‌ కూడా మొదలైందని తెలిపారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని