shock: టీ కొట్టుకు రూ.55 లక్షల కరెంటు బిల్లు!
close

తాజా వార్తలు

Published : 21/06/2021 11:10 IST

shock: టీ కొట్టుకు రూ.55 లక్షల కరెంటు బిల్లు!

ఉనా: రోడ్డు పక్కన టీ కొట్టు పెట్టుకున్న ఓ వ్యాపారికి హిమాచల్‌ప్రదేశ్‌ విద్యుత్తుశాఖ నిర్లక్ష్యంతో ‘షాక్‌’ ఇచ్చింది. అతని దుకాణానికి అక్షరాలా రూ. 55 లక్షల కరెంటు బిల్లు వేసింది. ఉనా జిల్లాలోని హరోలీలో టీ కొట్టు నడుపుకొంటున్న నరేశ్‌ కుమార్‌ ఈ బిల్లు చూసి నిర్ఘాంతపోయారు. ఇటీవల 4 నెలలకు అతనికి రూ. 6,702ల బిల్లు వచ్చింది. చెల్లించకపోవడంతో అధికారులు టీ దుకాణానికి విద్యుత్తు సరఫరాను నిలిపివేశారు. చివరకు బకాయిలను ఆన్‌లైన్‌లో చెల్లించాలని నరేశ్‌ పోర్టల్‌లో చూశాడు. అంతే.. ఒక్కసారిగా రూ. 55,14,945 బిల్లు కనిపించింది. దీంతో విద్యుత్తు  బోర్డ్‌ అధికారులను ఆశ్రయించాడు. పొరపాటుగా ఎక్కువ చూపిస్తోందని పేర్కొన్న అధికారులు సరి చేస్తామని చెప్పారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని