Third Wave: సెప్టెంబరు-అక్టోబరు మధ్య గరిష్ఠానికి
close

తాజా వార్తలు

Published : 23/06/2021 09:10 IST

Third Wave: సెప్టెంబరు-అక్టోబరు మధ్య గరిష్ఠానికి

ఐఐటీ కాన్పుర్‌ నిపుణుల అంచనా

దిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ రెండో దశ ఉద్ధృతి ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే, రానున్న రోజుల్లో మూడో దశ అనివార్యమని నిపుణులు ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సెప్టెంబరు-అక్టోబరు మధ్యకాలంలో మూడో దశ వ్యాప్తి గరిష్ఠానికి చేరుకునే అవకాశాలున్నట్లు ఐఐటీ కాన్పుర్‌ నిపుణులు అంచనా వేశారు. ‘‘అటు విధాన రూపకర్తలకు, ఇటు సామాన్య ప్రజలకు కరోనా మూడో దశపై ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో రెండో దశ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని ఎస్‌ఐఆర్‌ మోడల్‌ ఆధారంగా మూడో దశను అంచనా వేశాం’’ అని ఐఐటీ కాన్పుర్‌ ప్రొఫెసర్‌ రాజేష్‌ రంజన్‌ పేర్కొన్నారు. జులై 15 వరకు దేశవ్యాప్తంగా అన్‌లాక్‌ ప్రక్రియ జరిగితే.. మూడో దశ గరిష్ఠాన్ని తాకే సంభావ్యతను మూడు విభాగాల్లో అంచనా వేశామని చెప్పారు.
1 తిరిగి యథాస్థితికి రావడం: మూడో దశ అక్టోబరులో గరిష్ఠానికి చేరుకుంటుంది. కానీ, రెండో దశతో పోలిస్తే తీవ్రత తక్కువగానే ఉంటుంది.
2 వైరస్‌ ఉత్పరివర్తనాల ప్రభావం తక్కువే: వైరస్‌ వ్యాప్తి రెండో దశ గరిష్ఠం కన్నా ఎక్కువగా ఉంటే అది సెప్టెంబరు నాటికే కనిపించవచ్చు.
3 నిబంధనలు పాటిస్తేనే ప్రభావం తగ్గుతుంది: ఒకవేళ భౌతిక దూరం, కొవిడ్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తే కొవిడ్‌ గరిష్ఠ స్థాయి అక్టోబరు చివరివరకు ఆలస్యం కావొచ్చు.
అయినప్పటికీ రెండో దశతో పోలిస్తే ఈ గరిష్ఠ తీవ్రత తక్కువగా ఉంటుందని ఐఐటీ అధ్యయనం అంచనా వేసింది. కొన్ని ఈశాన్య రాష్ట్రాలు(మిజోరాం, మణిపుర్, సిక్కిం) మినహా దేశంలో రెండో దశ పూర్తిగా క్షీణించిందని తాజా అధ్యయనానికి నేతృత్వం వహించిన ప్రొఫెసర్‌ రాజేష్‌ రంజన్, మహేంద్రవర్మ తెలిపారు. ప్రస్తుతం దేశంలో కేరళ, గోవా, సిక్కిం, మేఘాలయ రాష్ట్రాల్లో కొవిడ్‌ పాజిటివిటీ రేటు 10 శాతానికి పైగా ఉండగా.. చాలా రాష్ట్రాల్లో 5 శాతం కంటే తక్కువగానే ఉందన్నారు. అయితే, ఈ నమూనాలో వ్యాక్సినేషన్‌ను పరిగణలోకి తీసుకోలేదని.. ఒకవేళ అలా తీసుకుంటే గరిష్ఠ స్థాయి తీవ్రత తగ్గుతుందని ఐఐటీ నిపుణులు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన మరో అధ్యయన వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని