UK: ముద్దు తెచ్చిన ముప్పు!

తాజా వార్తలు

Published : 27/06/2021 13:45 IST

UK: ముద్దు తెచ్చిన ముప్పు!

బ్రిటన్‌ ఆరోగ్య మంత్రి రాజీనామా

లండన్‌: కొవిడ్‌-19 లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించి, సహాయకురాలిని ముద్దు పెట్టుకోవడంపై దుమారం చెలరేగడంతో బ్రిటన్‌ ఆరోగ్య మంత్రి మ్యాట్‌ హాంకాక్‌ శనివారం తన పదవికి రాజీనామా చేశారు. ఈ మహమ్మారి సమయంలో ఎన్నో త్యాగాలు చేసిన ప్రజలకు ప్రభుత్వం రుణపడి ఉంటుందని పేర్కొన్నారు. సన్నిహిత కుటుంబ సభ్యులు కానివారితో భౌతిక దూరం పాటించాలన్న ప్రభుత్వ నిబంధనను ఉల్లంఘించినందుకు మరోసారి క్షమాపణ చెప్పారు. హాంకాక్‌.. బ్రిటన్‌ ఆరోగ్య, సామాజిక భద్రత కార్యాలయంలో గినా కొలాడాంగెలోను ముద్దుపెట్టుకోవడం సీసీటీవీ దృశ్యాల్లో నమోదైంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని