Lottery: అబుదాబిలో కేరళ డ్రైవర్‌కు జాక్‌పాట్‌

తాజా వార్తలు

Updated : 05/07/2021 10:17 IST

Lottery: అబుదాబిలో కేరళ డ్రైవర్‌కు జాక్‌పాట్‌

దుబాయ్‌: అబుదాబిలో టాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తున్న కేరళకు చెందిన వ్యక్తిని అదృష్టం వరించింది. లాటరీలో 3 కోట్ల దిర్హమ్‌లు (సుమారు రూ.40 కోట్లు) గెలుచుకున్నాడు. 37 ఏళ్ల రెంజిత్‌ సోమరాజన్‌ 2008 నుంచి అబుదాబిలో డ్రైవర్‌గా ఉన్నాడు. మూడేళ్లుగా లాటరీ టికెట్లు కొంటున్నాడు. గత నెల 29న మరో 9 మంది సహచరులతో కలిసి తలా 100 దిర్హమ్‌లు వేసుకుని తన పేరుపై టికెట్‌ కొన్నాడు. దీనికే జాక్‌పాట్‌ తగిలింది. తన సహచరుల్లో భారత్, పాకిస్థాన్, నేపాల్, బంగ్లాదేశ్‌ వ్యక్తులు ఉన్నారని, వచ్చే మొత్తాన్ని సమానంగా పంచుకుంటామని చెప్పాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని