అక్కడ మరుగుదొడ్డి వాడితే..తిరిగి డబ్బులిస్తారు

తాజా వార్తలు

Published : 11/07/2021 15:05 IST

అక్కడ మరుగుదొడ్డి వాడితే..తిరిగి డబ్బులిస్తారు

ఉల్సాన్‌ (దక్షిణ కొరియా): సాధారణంగా మనం ఏదైనా మరుగుదొడ్డిని వినియోగించుకుంటే.. కొంత డబ్బులు వసూలు చేస్తారు.. కానీ దక్షిణకొరియాలో మాత్రం తిరిగి మనకే నగదు ఇస్తున్నారు. ఆశ్చర్యంగా ఉంది కదూ. ఉల్సాన్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో పట్టణ, పర్యావరణ ఇంజినీరింగ్‌ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తించే చో జై-వూన్‌ ఓ మరుగుదొడ్డిని రూపొందించారు. ఇందులో మనుషుల మల విసర్జనను ఉపయోగించి బయోగ్యాస్, ఎరువులను ఉత్పత్తి చేస్తున్నారు. వాక్యూమ్‌ పంప్‌ సాయంతో మానవ వ్యర్థాలను భూగర్భ ట్యాంకులోకి పంపి.. సూక్ష్మజీవుల ద్వారా మిథేన్‌గా మారుస్తారు. అనంతరం ఇంటికి అవసరమైన విద్యుత్తు, బయోగ్యాస్, ఎరువులను తయారు చేస్తున్నారు. ప్రస్తుతం విశ్వవిద్యాలయానికి సరిపడా విద్యుత్తునూ దీని ద్వారానే వాడుతున్నారు. విద్యుత్తు, ఎరువు తయారీకి మలం ఎంతగానో ఉపయోగపడుతుందని.. అంటున్న చో.. ఈ మరుగుదొడ్లను స్థానిక ప్రజలు వాడేలా ప్రోత్సహించేందుకు తిరిగి కొంత నగదు చెల్లిస్తున్నట్లు తెలిపారు. కాఫీ, అరటి పండ్లు కొనేందుకు డబ్బులు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అంతేకాదు.. ఆ మరుగుదొడ్డిలోని క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేస్తే నేరుగా ఖాతాలో డబ్బులు జమ అవుతాయని చో జై-వూన్‌ తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని