Vaccine: రెండు డోసులతోనే డెల్టా నుంచి రక్షణ 

తాజా వార్తలు

Published : 11/07/2021 13:23 IST

Vaccine: రెండు డోసులతోనే డెల్టా నుంచి రక్షణ 

వాషింగ్టన్‌: ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న కరోనాలోని డెల్టా వేరియంట్‌ నుంచి రక్షణ పొందాలంటే పూర్తిస్థాయిలో టీకా వేయించుకోవడమే శరణ్యమని ఫ్రాన్స్‌ నిపుణుల అధ్యయనం పేర్కొంది. ఒక్క డోసుతో పెద్దగా ఉపయోగం ఉండబోదని వారు చెప్పారు. గతంలో కొవిడ్‌-19 ఇన్‌ఫెక్షన్‌ బారినపడని వ్యక్తులు ఫైజర్‌ లేదా ఆస్ట్రాజెనెకా టీకాలకు సంబంధించి ఒకే డోసును పొందితే వారిలో డెల్టా లక్ష్యంగా చేసుకొనే యాంటీబాడీలు పెద్దగా ఉత్పత్తి కాబోవని తేల్చారు. రెండు డోసులు పొందితే డెల్టాతోపాటు ఆల్ఫా, బీటా రకాల నుంచీ రక్షణ లభిస్తుందని గుర్తించారు. ఒకే డోసు పొందినవారిలో 10 శాతం మంది మాత్రమే డెల్టా వేరియంట్‌ను ఎదుర్కోగలరని వెల్లడైనట్లు చెప్పారు. రెండో డోసు పొందాక 95 శాతం మందికి రక్షణ లభిస్తున్నట్లు తేల్చారు. కొవిడ్‌ నుంచి కోలుకున్నవారిలో సహజసిద్ధంగా ఉత్పత్తయిన యాంటీబాడీలు డెల్టా రకం విషయంలో 4-6 రెట్లు తక్కువగా సామర్థ్యాన్ని చూపుతున్నాయని గుర్తించారు. వీరు ఒక డోసు పొందితే రక్షణ పెరుగుతుందని తేల్చారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని