దేశంపై బురద జల్లేందుకు విదేశీ నిధులతో కుట్ర

తాజా వార్తలు

Published : 19/07/2021 14:43 IST

దేశంపై బురద జల్లేందుకు విదేశీ నిధులతో కుట్ర

ఒక వార్తా వెబ్‌సైట్‌పై భాజపా విమర్శ

దిల్లీ: దేశాన్ని, నరేంద్రమోదీ సర్కారును అప్రతిష్ఠ పాల్జేసేందుకు ఒక వార్తా వెబ్‌సైట్‌కు విదేశాల నుంచి అనుమానాస్పద రీతిలో నిధులు అందుతున్నాయని భాజపా ఆరోపించింది. దేశ వ్యతిరేక శక్తులు విదేశీ శక్తులతో కుమ్మక్కు అవుతున్నాయని భాజపా అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్రా ఆదివారం విలేకరుల సమావేశంలో చెప్పారు. ‘‘న్యూస్‌క్లిక్‌ అనే పోర్టల్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ విచారణ జరిపినప్పుడు రూ.9.59 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐల) విషయం బయటపడింది. దీంతోపాటు అనుమానాస్పద రీతిలో రూ.28.46 కోట్ల విదేశీ నిధులను ఆ పోర్టల్‌ అందుకుంది. భారత వ్యతిరేక ప్రచారాన్ని ఎగదోసేవారికి డబ్బులిస్తూ విదేశీ శక్తుల తరఫున ప్రచారం చేస్తున్నారు. ఈ పని కోసం మీడియా ముసుగును ఆ పోర్టల్‌ ధరించింది. దేశంలోని కొన్ని ప్రధాన పార్టీల నేతల అండదండలు అలాంటి పోర్టల్‌లకు ఉంటున్నాయి. పథకం ప్రకారం ఒక ముఠాగా వారంతా పనిచేస్తున్నారు’’ అని పాత్రా ఆరోపించారు. పాత్రా ఆరోపణల్ని న్యూస్‌క్లిక్‌ ఎడిటర్‌-ఇన్‌-చీఫ్‌ ప్రబీర్‌ పురకాయస్థ ఖండించారు. ఈడీ దర్యాప్తును తాము కోర్టులో సవాల్‌ చేశామని చెప్పారు. అందించిన సేవలకు గానూ విదేశాల నుంచి డబ్బును బ్యాంకు లావాదేవీల ద్వారానే స్వీకరించామని స్పష్టంచేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని