Forest: దేశంలోనే అతిపెద్ద మానవ నిర్మిత అడవి

తాజా వార్తలు

Updated : 19/07/2021 10:48 IST

Forest: దేశంలోనే అతిపెద్ద మానవ నిర్మిత అడవి

ఛత్తీస్‌గఢ్‌లో నిర్మాణానికి ప్రణాళిక 
885 ఎకరాల్లో 80 వేల మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు

దుర్గ్‌: ఒకప్పుడు అది అటవీ ప్రాంతం. ఆ తర్వాత సున్నపురాయి గనుల కోసం పెద్ద ఎత్తున తవ్వకాలు జరిపారు. కాలక్రమంలో అక్కడ భారీ గుంతలు ఏర్పడడంతో పాటు చెట్లు మచ్చుకైనా కనిపించకుండా పోయాయి. కొన్నాళ్లకు తవ్వకాలు కూడా నిలిచిపోవడంతో 17 ఎకరాల విస్తీర్ణం నిర్జీవ ప్రదేశంగా మారిపోయింది. అలాంటిచోట మళ్లీ అడవిని నిర్మించేందుకు ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం సంకల్పించింది. ఏకంగా 885 ఎకరాల్లో 80 వేల మొక్కలను నాటడం ద్వారా దేశంలోనే అతిపెద్ద మానవ నిర్మిత అడవిని సృష్టించేందుకు ప్రణాళిక వేసింది.

ఇందుకు రూ.3 కోట్లను వెచ్చించనుంది. దీంతో దుర్గ్‌ జిల్లాలోని మూతపడిన నందిని లైమ్‌స్టోన్‌ సైట్‌ ప్రాంతం మళ్లీ పచ్చదనాన్ని సంతరించుకోనుంది. ముఖ్యమంత్రి భూపేశ్‌ బఘేల్‌ ఆదేశాల మేరకు వచ్చే మూడేళ్లపాటు ఇక్కడ అటవీ పునర్నిర్మాణాన్ని కొనసాగించనున్నామని, ఫలితంగా ఇక్కడి అటవీ ప్రాంత విస్తీర్ణం 2,500 ఎకరాలకు పెరుగుతుందని అధికారులు తెలిపారు. గనుల తవ్వకాలు జరిగిన ప్రాంతాలను తిరిగి సహజ ఆవాసాలుగా ఎలా మార్చవచ్చన్నది ప్రపంచానికి తెలిపేలా ఈ ప్రాజెక్టును నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. స్థానిక పక్షులతో పాటు వలస విహంగాలకు విడిదిగా, పర్యావరణ పర్యాటకానికి కేంద్రంగా దీన్ని తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని