ఓ‘పెన్‌’ చేయాలంటే రూ.7 లక్షలు

తాజా వార్తలు

Published : 20/07/2021 10:46 IST

ఓ‘పెన్‌’ చేయాలంటే రూ.7 లక్షలు

బెంగళూరు : ఒక పెన్‌.. ఎంత ఖరీదు ఉంటుంది. రూ.10 నుంచి రూ.వెయ్యి వరకు ఉంటుంది. ఇంకాస్త విభిన్నమైనది అయితే రూ.వేలల్లో ఉంటుంది. అలాంటిది బెంగళూరులోని కోరమంగళలో విలియమ్‌ పెన్స్‌ సంస్థ రూ.7 లక్షల విలువైన కలాన్ని విక్రయానికి ఉంచింది. ఈ సంస్థ 20 ఏళ్లుగా బ్రాండెడ్‌ కలాలకు చిరునామాగా నిలుస్తోంది. ఇక్కడ రూ.10వేల విలువైన కలాలు విపరీతంగా అమ్ముడవుతున్నాయి. రూ.35వేలు విలువ చేసే కలాలను కొనుగోలు చేసేందుకూ ఖాతాదారులు ఆసక్తి కనబరుస్తున్నారని నిర్వాహకులు తెలిపారు. ఈ క్రమంలో ఇటీవల విదేశాలకు చెందిన వివిధ రకాల ఖరీదైన కలాలను ‘విలియమ్‌ పెన్స్‌’ విక్రయానికి ఉంచింది. వాటిలో స్విట్జర్లాండ్‌కు చెందిన ‘కరన్‌డాష్‌’ సంస్థ రూపొందించిన ఓ కలం ధర ఏకంగా రూ.7 లక్షలు. దీని తయారీలో బంగారంతోపాటు అత్యంత విలువైన రాళ్లను ఉపయోగించినందునే అంత ధర. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని