AC Room: ఏసీ గదిలో దోమలకు పొగ.. ఊపిరాడక మహిళ మృతి

తాజా వార్తలు

Published : 23/07/2021 09:20 IST

AC Room: ఏసీ గదిలో దోమలకు పొగ.. ఊపిరాడక మహిళ మృతి

చెన్నై (క్రైం), న్యూస్‌టుడే: దోమలను తరిమేందుకు ఏసీ గదిలో పొగపెట్టడంతో ఊపిరాడక ఓ మహిళ ప్రాణాలు కోల్పోయిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..చెన్నై పమ్మల్‌ తిరువళ్ళువర్‌ వీధికి చెందిన చొక్కలింగం ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య పుష్పలక్ష్మి (53), కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఇంట్లో దోమలు ఎక్కువగా ఉండటంతో బుధవారం రాత్రి ప్లేటులో బొగ్గులు ఉంచి పొగపెట్టారు. దాంతోపాటు దోమలను పోగొట్టేందుకు ఓ నూనెను అందులో పోసినట్లు తెలుస్తోంది. దీంతో ఇల్లంతా పొగ వ్యాపించింది. ఆ సమయంలో ఏసీ వేసుకుని కుటుంబమంతా నిద్రపోయారు. పొగ ధాటికి నలుగురూ స్పృహ కోల్పోయారు. గురువారం ఉదయం ఎంతసేపటికీ వారు బయటకు రాకపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చి తలుపులు పగులగొట్టి చూడగా అప్పటికే పుష్పలక్ష్మి మృతిచెందింది. శంకర్‌ నగర్‌ పోలీసులు అక్కడకు చేరుకుని స్పృహ కోల్పోయిన ముగ్గురిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని