ఆడ వేషంలో విమానం ఎక్కి.. అధికారులకు దొరికిపోయి..

తాజా వార్తలు

Updated : 23/07/2021 12:45 IST

ఆడ వేషంలో విమానం ఎక్కి.. అధికారులకు దొరికిపోయి..

జకార్తా: కరోనా సోకినవారు ప్రయాణాలు చేయడానికి అనుమతి లేకపోవడంతో ఓ వ్యక్తి విమానం ఎక్కడానికి అతి తెలివి ప్రదర్శించాడు. తన భార్యలా వేషం మార్చుకుని విమానాశ్రయ అధికారులను బురిడీ కొట్టించి విమానం ఎక్కాడు. అది టేకాఫ్‌ కూడా అయింది. ఇక గమ్యస్థానానికి చేరుకోబోతున్నానన్న ఆనందంలో అతడు చేసిన ఓ తప్పిదంతో ఊహించని ట్విస్ట్‌ ఎదురైంది. అధికారులకు దొరికిపోయి జైలుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇండోనేసియాలో ఈ ఘటన జరిగింది. కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన ఓ వ్యక్తి జకార్తా నుంచి టెర్నేట్‌కు విమానంలో వెళ్లాలనుకున్నాడు. అందుకోసం తన భార్యగా మారిపోయాడు. బురఖా ధరించడంతో పాటు భార్య గుర్తింపు కార్డులు, ఆమెకు సంబంధించిన కొవిడ్‌ నెగటివ్‌ ధ్రువపత్రం వెంట తీసుకుని విమానాశ్రయానికి చేరుకున్నాడు. ముందస్తుగా టికెట్‌ కూడా భార్య పేరుమీదే తీసుకున్నాడు. తనిఖీ అధికారులు కనిపెట్టలేకపోవడంతో విమానం ఎక్కాడు. కాసేపట్లే విమానం టెర్నేట్‌కు చేరుకుంటుందనగా అతడు బాత్‌రూమ్‌లోకి వెళ్లాడు. కానీ బయటకు పురుష వస్త్రధారణలో వచ్చాడు. దీన్ని విమాన సిబ్బంది ఒకరు గమనించి టెర్నేట్‌ విమానాశ్రయ అధికారులకు సమాచారమిచ్చాడు. ఇంకేముంది.. విమానం దిగగానే పోలీసులు వచ్చి అదుపులోకి తీసుకున్నారు. కరోనా పరీక్షలు చేయడంతో పాజిటివ్‌ వచ్చింది. ప్రస్తుతం అతణ్ని క్వారంటైన్‌లో ఉంచారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని