Afghanistan: భారతీయులూ.. అఫ్గాన్‌లో జర భద్రం

తాజా వార్తలు

Published : 25/07/2021 22:19 IST

Afghanistan: భారతీయులూ.. అఫ్గాన్‌లో జర భద్రం

అత్యవసరమైతేనే బయటకు వెళ్లండి 
 రాయబార కార్యాలయం సూచనలు

కాబూల్‌: తీవ్ర సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటున్న అఫ్గానిస్థాన్‌లో నివసిస్తున్న, ఉద్యోగ విధులు నిర్వర్తిస్తున్న భారత పౌరులను అప్రమత్తం చేస్తూ భద్రతాపరమైన సూచనలు జారీ అయ్యాయి. ప్రధాన నగరాలను వీడి వెళ్ల వద్దని, అత్యవసరమైతే మినహా ఇళ్ల నుంచి బయటకు కదల వద్దని, రద్దీగా ఉండే ప్రదేశాల్లో సంచరించవద్దంటూ శనివారం భారత రాయబార కార్యాలయం హెచ్చరికలు చేసింది. అఫ్గానిస్థాన్‌లోని పలు ప్రావిన్సులలో ప్రమాదకరమైన పరిస్థితులు నెలకొన్నాయని తెలిపింది. వివిధ ప్రాంతాల్లో ప్రయాణించే భారత మీడియా ప్రతినిధులకు కూడా ఇదే విధమైన సూచనలు చేసింది.

30 మందికి పైగా తాలిబన్లు హతం

తాలిబన్లు, అఫ్గాన్‌ సైన్యం మధ్య జరిగిన పోరులో 30 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. మరో 17 మందికి గాయాలయ్యాయి. జజ్వాన్‌ రాష్ట్రం ముర్గాబ్, హసన్‌ గ్రామాల్లోని స్థావరాలపై జరిగిన దాడుల్లో 19 మంది, హెల్మాండ్‌ రాష్ట్రం లష్కర్‌ ఘా ప్రాంతంలో 14 మంది ముష్కరులు, మరో ఇద్దరు విదేశీ ఉగ్రవాదులు హతమైనట్లు రక్షణశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని