Petrol prices: పెట్రో ధరల ఏకరూపతకు పథకమేమీ లేదు: కేంద్రం

తాజా వార్తలు

Updated : 27/07/2021 12:35 IST

Petrol prices: పెట్రో ధరల ఏకరూపతకు పథకమేమీ లేదు: కేంద్రం

పార్లమెంట్‌ సమాచారం

దిల్లీ: పెట్రో ఉత్పత్తుల ధరలు దేశవ్యాప్తంగా ఒకే విధంగా ఉండేలా చేసే పథకమేదీ కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో లేదని పెట్రోలియంశాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పురీ లోక్‌సభకు తెలిపారు. రవాణా ఛార్జీలు, వ్యాట్, స్థానిక పన్నులు వేర్వేరుగా ఉన్నందున పెట్రో ఉత్పత్తుల ధరలు ఆయా ప్రాంతాల్లో వేర్వేరుగా ఉన్నట్లు చెప్పారు. పెట్రో ఉత్పత్తులను జీఎస్‌టీ పరిధిలోకి తెచ్చేందుకు జీఎస్‌టీ కౌన్సిల్‌ సిఫారసు చేయలేదని స్పష్టం చేశారు.

పెట్రోల్‌పై మధ్యప్రదేశ్‌లో..

డీజిల్‌పై రాజస్థాన్‌లో అత్యధిక పన్నులు దేశంలోకెల్లా మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో పెట్రోల్‌పై (లీటరుకు రూ.31.55), రాజస్థాన్‌లో డీజిల్‌పై (లీటరుకు రూ.21.82)అత్యధిక వ్యాట్‌ విధిస్తున్నారని హర్‌దీప్‌ సింగ్‌ వెల్లడించారు. అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో అత్యంత తక్కువ (లీటరు పెట్రోల్‌పై రూ.4.82, డీజిల్‌పై రూ.4.74) పన్ను వసూలు చేస్తున్నారు. కేంద్రం విధించే పన్నులకు రాష్ట్రాలు వసూలు చేసే వ్యాట్‌ అదనం. పెట్రో ఉత్పత్తులపై గత రెండేళ్లలో రాష్ట్రాలకు వచ్చే పన్ను ఆదాయం పెరిగినట్లు మంత్రి తెలిపారు. 2019-20, 2020-21లో ఏపీకి వరుసగా రూ.10,168 కోట్లు, రూ.11,014 కోట్ల ఆదాయం రాగా, తెలంగాణకు రూ.10,045, రూ.8,691 కోట్లు వచ్చినట్లు చెప్పారు. 

దేశంలో ఏడు జోనల్‌ సాంస్కృతిక కేంద్రాలు: కిషన్‌రెడ్డి

భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించడానికి దేశంలో 7 జోనల్‌ సాంస్కృతిక కేంద్రాల(కల్చరల్‌ సెంటర్ల)ను ఏర్పాటు చేసినట్లు కేంద్ర పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. ఇందులో దక్షిణ(సౌత్‌)జోన్‌కు తంజావూరు, ఉత్తర(నార్త్‌)జోన్‌కు పాటియాలా, పశ్చిమ(వెస్ట్‌)జోన్‌కు ఉదయ్‌పుర్, దక్షిణమధ్య(సౌత్‌ సెంట్రల్‌)జోన్‌కు నాగ్‌పుర్, తూర్పు (ఈస్ట్రన్‌)జోన్‌కు కోల్‌కతా, ఉత్తరమధ్య(నార్త్‌సెంట్రల్‌)జోన్‌కు ప్రయాగ్‌రాజ్, ఈశాన్య (నార్త్‌ఈస్ట్‌)జోన్‌కు దిమాపుర్‌ ప్రధాన కేంద్రాలుగా ఉంటాయని తెలిపారు. స్వదేశీ కళాకారుల చేతుల్లో ప్రాణం పోసుకున్న భారతీయ సాంస్కృతిక వైవిధ్యాన్ని రక్షించి, ప్రోత్సహించడానికి ఈ కేంద్రాలు పనిచేస్తాయని చెప్పారు.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని