Covid Vaccine: టీకా పొందకుంటే రెండోసారి కొవిడ్‌ ముప్పు

తాజా వార్తలు

Updated : 08/08/2021 12:13 IST

Covid Vaccine: టీకా పొందకుంటే రెండోసారి కొవిడ్‌ ముప్పు

వాషింగ్టన్‌: కొవిడ్‌-19 టీకా పొందాల్సిన ఆవశ్యకతను సూచించే కొత్త విషయాన్ని అమెరికాలోని ‘సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌’ (సీడీసీ) సంస్థ వెలుగులోకి తెచ్చింది. వ్యాక్సిన్‌ తీసుకున్నవారితో పోలిస్తే.. తీసుకోనివారికి రెండోసారి కరోనా సోకే ముప్పు రెట్టింపు స్థాయిలో ఉంటుందని వెల్లడైంది. అధ్యయనంలో భాగంగా వందల మందిని పరిశీలించిన శాస్త్రవేత్తలు ఈ మేరకు తేల్చారు. వీరికి గత ఏడాది కొవిడ్‌ సోకింది. ఈ ఏడాది మే, జూన్‌ నెలల్లో రెండోసారి ఇన్‌ఫెక్షన్‌ బారిన పడ్డారు.

‘‘టీకా పొందని వారికి రీ ఇన్‌ఫెక్షన్‌ ముప్పు 2.34 రెట్లు ఎక్కువగా ఉందని వెల్లడైంది. అందువల్ల గతంలో కొవిడ్‌ బారినపడిన వారు కూడా తప్పనిసరిగా వ్యాక్సిన్‌ వేయించుకోవాలి’’ అని సీడీసీ డైరెక్టర్‌ రోషెల్‌ వాలెన్‌స్కీ తెలిపారు. డెల్టా రకం కరోనా ఉద్ధృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఇది అవసరమని చెప్పారు. అమెరికాలో ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న కరోనా వేరియంట్లలో దీని వాటా 83 శాతం మేర ఉందని వివరించారు. ముప్పు ఎక్కువగా ఉండే వయోధికులు కొవిడ్‌తో ఆసుపత్రిపాలు కాకుండా చూడటంలో టీకాలు సమర్థతను చాటాయని కూడా తెలిపారు. ఫ్లూ టీకాల కన్నా మెరుగ్గా ఇవి పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని