Tamil Nadu: ఈ చిన్నోడు.. 427 గ్రామాలకు పెదరాయుడు

తాజా వార్తలు

Published : 12/08/2021 08:33 IST

Tamil Nadu: ఈ చిన్నోడు.. 427 గ్రామాలకు పెదరాయుడు

పెదరాయుడు సినిమా చాలా మంది చూసే ఉంటారు. అందులో గ్రామపెద్ద చెప్పిందే వేదం. ఆయన చెప్పిన తీర్పును తప్పకుండా పాటిస్తారు. ఇదే విధానం తమిళనాడులోని కొన్ని గ్రామాల్లోనూ అమలవుతోంది. కానీ, ఆ తీర్పు చెప్పే వ్యక్తి తలపండిన వృద్ధుడేమీ కాదు.. ఐదో తరగతి చదివే బాలుడు. తూర్పు కనుమలకు ఆనుకొని తిరువన్నామలై, వెల్లూర్, తిరుపట్టూర్‌ జిల్లాల్లో 427 గ్రామాలు ఉన్నాయి. గత 80 ఏళ్లుగా ఈ గ్రామాలకు పెద్దగా వ్యవహరించిన మల్లిమాడుకు చెందిన చిన్నంది(87) అనారోగ్య కారణాలతో గతేడాది చనిపోయారు. దీంతో ఆయన వారసుడిని ఎంపిక చేసేందుకు ఇన్నాళ్లు మల్లగుల్లాలు పడ్డారు. 36 గ్రామాల ప్రతినిధులు సమావేశమై.. చివరకు తమ సంప్రదాయం ప్రకారం చిన్నంది మనవడు శక్తివేల్‌ను గ్రామ పెద్దగా ఎంపిక చేశారు. ఈ నిర్ణయాన్ని మిగిలిన గ్రామాల ప్రజలు స్వాగతించారు. శక్తివేల్‌ ప్రస్తుతం నవాలూర్‌ పంచాయతీ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు. జావదు తెగ ప్రజలంతా పంచాయతీ వ్యవస్థను ఇప్పటికీ గౌరవిస్తారు. ఇక్కడ వెలువడిన తీర్పులను పాటిస్తారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని