Bihar: జడ ఉంటేనే కళాశాలలోకి అనుమతి.. సెల్ఫీలపై నిషేధం

తాజా వార్తలు

Published : 23/08/2021 14:52 IST

Bihar: జడ ఉంటేనే కళాశాలలోకి అనుమతి.. సెల్ఫీలపై నిషేధం

బిహార్‌లోని భాగల్‌పుర్‌లో ఉన్న సుందరావతి మహిళా మహా విద్యాలయం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. కళాశాల ఆవరణలో యువతులు పక్కాగా జడ వేసుకుని కనిపించాలని యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది.  అంతేగాకుండా ఈ ఏడాది ఇంటర్‌లో చేరిన బాలికలకు ప్రత్యేక డ్రెస్‌కోడ్‌ను నిర్దేశించింది. దీనితో పాటు విద్యార్థినిలు కళాశాల ఆవరణలో సెల్ఫీలు తీసుకోవడం కూడా నిషేధించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. అమ్మాయిలు లూజ్‌ హెయిర్‌తో వస్తే వారిని కళాశాలలోకి అనుమతించబోమని ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌. రామన్‌ సిన్హా తేల్చి చెప్పారు. కళాశాల కమిటీ తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం వివాదాస్పదంగా మారుతోంది. సైన్స్, కామర్స్, ఆర్ట్స్‌ అనే మూడు విభాగాలు ఉన్న ఈ కళాశాలలో ప్రస్తుతం 1,500 మంది అమ్మాయిలు చేరారు. ఈ నేపథ్యంలో ప్రిన్సిపాల్‌ కొత్త డ్రెస్‌ కోడ్‌ను నిర్ణయించడానికి ఓ కమిటీని ఏర్పాటు చేశారు. అందులో ఉన్న సభ్యులు సూచించిన దుస్తులనే ధరించాలని కళాశాల యాజమాన్యం నిర్ణయించింది. సంస్థ అదేశాలను ఎవరైనా అతిక్రమించి డ్రెస్‌కోడ్‌ లేకుండా, జడ వేసుకోకుండా వచ్చే వారికి ప్రవేశం లేదని స్పష్టం చేసింది. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని