Covid Vaccine: టీకాతో ‘లాంగ్‌ కొవిడ్‌’ దూరం!

తాజా వార్తలు

Updated : 03/09/2021 16:38 IST

Covid Vaccine: టీకాతో ‘లాంగ్‌ కొవిడ్‌’ దూరం!

లాన్సెట్‌ అధ్యయనంలో వెల్లడి

లండన్‌: కొవిడ్‌-19ను ఎదుర్కోవడంలో టీకాల సమర్థత మరోసారి రుజువైంది. ఒకటి లేదా రెండు డోసులు పొందినవారికి తీవ్రస్థాయి కరోనా ఇన్‌ఫెక్షన్‌ బారినపడే లేదా ఆసుపత్రిపాలయ్యే ముప్పు చాలా తక్కువగా ఉంటుందని బ్రిటన్‌లోని కింగ్స్‌ కాలేజీ లండన్‌ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. ఈ వివరాలు ప్రముఖ వైద్య పత్రిక ‘ద లాన్సెట్‌ ఇన్‌ఫెక్షస్‌ డిసీజెస్‌’లో ప్రచురితమయ్యాయి. కరోనా పాజిటివ్‌గా తేలిన 28 రోజుల తర్వాత కూడా కొందరిలో వ్యాధి లక్షణాలు కొనసాగుతూనే ఉంటాయి. దీన్ని ‘లాంగ్‌ కొవిడ్‌’గా పేర్కొంటారు. టీకా రెండు డోసులూ పొందితే.. ఈ ముప్పు సగానికి తగ్గిపోతుందని కూడా పరిశోధనలో వెల్లడైంది. ‘‘ప్రపంచవ్యాప్తంగా డెల్టా వేరియంట్‌ విజృంభిస్తున్న వేళ మనం కీలక దశలో ఉన్నాం. టీకా పొందినప్పటికీ ఇన్‌ఫెక్షన్‌ సోకే (బ్రేక్‌థ్రూ) పరిస్థితి ఉంది. అయితే తీవ్రస్థాయి అనారోగ్యం నుంచి కాపాడటమే టీకాల విధి. ఆ లక్ష్యాన్ని అవి అద్భుతంగా అందుకుంటున్నాయి’’ అని పరిశోధనలో పాల్గొన్న క్లెయిర్‌ స్టీవ్స్‌ చెప్పారు. పరిశోధనలోని తేలిన ప్రధానాంశాలివీ..

* పట్టణాల్లో జనాభా సాంద్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో బ్రేక్‌థ్రూ ఇన్‌ఫెక్షన్‌ ముప్పు అధికం. చాలావరకూ.. రెండో డోసు పొందేలోపు ఇలాంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. 

బలహీనంగా ఉండే వయోధికులు, ఊబకాయం, గుండె జబ్బు, మూత్రపిండాలు, ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్నవారికి తొలి డోసు వేశాక కూడా కరోనా సోకే ముప్పు ఎక్కువగా ఉంటుంది. 

కొవిడ్‌తో ఆసుపత్రిపాలైనవారిలో 27 శాతం మంది చనిపోతున్నట్లు పరిశోధనల్లో స్పష్టమవుతోంది. అసలు ఆసుపత్రిలోనే చేరే పరిస్థితి ఉండకూడదనుకుంటే టీకాలు పొందడమే సరైన మార్గం. 



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని