Afghanistan: అఫ్గాన్‌లో సెక్స్‌ వర్కర్లకు బహిరంగ మరణశిక్ష?

తాజా వార్తలు

Published : 05/09/2021 10:41 IST

Afghanistan: అఫ్గాన్‌లో సెక్స్‌ వర్కర్లకు బహిరంగ మరణశిక్ష?

అమలు చేసేందుకు తాలిబన్ల ప్రణాళిక

కాబుల్‌: మహిళలు, మైనార్టీల హక్కులను పరిరక్షించాలని... తాలిబన్ల చెవులు చిల్లులు పడేలా అంతర్జాతీయ సమాజం చెబుతూనే ఉంది! అయినాసరే, వారు తమ పంథాను వీడనట్టే కనిపిస్తోంది. కాబుల్‌ను ఆక్రమించుకున్న రోజున... దేశ ప్రజలందర్నీ క్షమిస్తున్నామని తాలిబన్లు ప్రకటించారు. అన్ని వర్గాల ప్రాతినిధ్యంతో కూడిన సమ్మిళిత ప్రభుత్వాన్ని నెలకొల్పుతామని బాహాటంగా చెబుతున్నారు. కానీ... క్షేత్రస్థాయిలో వారు చేయాలనుకుంటున్నది వేరు! దేశంలో పడుపు వృత్తిలో ఉన్న వేశ్యలందర్నీ బహిరంగంగా ఉరితీసేందుకు తాలిబన్లు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు సమాచారం! సెక్స్‌ వర్కర్లను గుర్తించేందుకు పోర్న్‌ వెబ్‌సైట్లను చూసి మరీ తాలిబన్లు జాబితాను సిద్ధం చేస్తున్నారని కథనాలు వెలువడుతున్నాయి. విదేశీయులతో శృంగారంలో పాల్గొన్న అఫ్గాన్‌ మహిళలను గుర్తించి, వారికి మరణశిక్ష విధించే ఆలోచనలో తాలిబన్లు ఉన్నట్టు ‘ద సన్‌’ పత్రిక పేర్కొంది. ఇప్పటికే వేశ్యల జాబితాను సిద్ధం చేస్తున్నారు. ఇది పూర్తయిన తర్వాత తమ చట్టాల ప్రకారం వీరికి మరణశిక్ష విధించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. కానీ, అందర్నీ కాదట! తమకు నచ్చినవారిని మాత్రం ‘లైంగిక బానిసలు’గా వాడుకోవాలని తాలిబన్లు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. మహిళల భద్రతకు హామీ ఇచ్చినా, తమకు నచ్చనివారిని వదిలిపెట్టే ప్రసక్తి మాత్రం లేదని వారు సంకేతాలు ఇస్తున్నారు.

అప్పుడూ అదే సంచలనం... 

అఫ్గాన్‌లో పడుపు వృత్తి చట్టవిరుద్ధం. వేశ్యలు పట్టుబడితే జైలు తప్పదు. 1996-2001 మధ్య అఫ్గాన్‌లో అధికారం చేపట్టిన తాలిబన్లు.. సెక్స్‌ వర్కర్లకు బహిరంగ మరణశిక్ష అమలు చేశారు. అప్పట్లో ఇది ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. తాజా పరిణామాల క్రమంలో.. తాలిబన్ల పాలనలో సెక్స్‌ వర్కర్ల ప్రాణాలకు తీవ్ర ముప్పు ఉన్నట్టు అంతర్జాతీయ మీడియా ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేసింది. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని