Kerala: అతడు మా ఆవులపై అత్యాచారం చేస్తున్నాడు

తాజా వార్తలు

Updated : 06/09/2021 10:06 IST

Kerala: అతడు మా ఆవులపై అత్యాచారం చేస్తున్నాడు

పోలీసులకు రైతుల ఫిర్యాదు!

కొల్లం: కేరళలోని కొల్లం జిల్లా మయనాడ్‌లోని కొందరు రైతులకు విచిత్ర సమస్య తలెత్తింది. వారంతా.. తమకు జీవనాధారమైన ఆవులను అమ్మేసుకుంటున్నారు. ఇలా ఎందుకు అనుకుంటున్నారా? కారణం ఉంది. వారి ఆవులపై ఓ వ్యక్తి అత్యాచారం చేస్తున్నాడట. ఇదే గోడు పోలీసులకు చెప్పారు. ఇక్కడ 20 మంది పశుపోషకులు బాధితులుగా మారారు. 2021 జనవరి నుంచి తరచూ వారి ఆవులపై దాడి జరుగుతోంది. చాలా రోజుల వరకు వారికి అసలు విషయం తెలియలేదు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించాకే.. అది లైంగిక దాడి అని తెలిసొచ్చింది. తంబి అనే రైతుకు ఏడు ఆవులు ఉండేవి. వాటిల్లో నాలుగింటిని అమ్మేశాడు. కారణం.. వాటిపై ఐదు సార్లు అత్యాచారం జరగడం. ఆవులను కట్టేసి కొట్టడమే కాకుండా నిందితుడు.. వాటి జననాంగాల్లో కర్రలను చొప్పించేవాడట. పొదుగులను రాళ్లతో కొట్టి గాయపర్చేవాడని రైతులు ఆరోపించారు.  ‘‘ఎవరో వ్యక్తిగత కక్షతో మా ఆవులపై దాడి చేస్తున్నారనుకున్నా. ఆ తర్వాత చాలా మంది రైతులు ఇదే సమస్యను లేవనెత్తారు. అప్పుడే తెలిసింది.. ఈ వ్యక్తి అసహజ రీతిలో ఆవులపై లైంగిక కార్యకలాపాలు సాగిస్తున్నాడు’’ అని తంబి అనే రైతు తెలిపారు. ఇలాంటి సమస్య ఉన్న  20 మంది కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని పట్టుకొని.. పోలీసులకు అప్పగించారు. రైతులు అనుమానిస్తున్న వ్యక్తి మానసిక స్థితి బాగాలేదని, ఈ వ్యవహారంపై దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని