Madhya Pradesh: విద్యార్థినుల దుస్తులపై అసభ్యకర వ్యాఖ్యలు

తాజా వార్తలు

Published : 06/09/2021 14:13 IST

Madhya Pradesh: విద్యార్థినుల దుస్తులపై అసభ్యకర వ్యాఖ్యలు

 ప్రధానోపాధ్యాయుడిపై పోక్సో కేసు

రాజ్‌గఢ్‌: యూనిఫాం ధరించకుండా వచ్చిన విద్యార్థినులపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ప్రధానోపాధ్యాయుడిపై మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్‌ జిల్లాలో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక మచల్‌పుర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని కొంత మంది బాలికలు యూనిఫాం ధరించకుండా సాధారణ దుస్తుల్లో వచ్చారు. ఇది ప్రధానోపాధ్యాయుడు రాధేశ్యామ్‌ మాలవియా(50)కు ఆగ్రహం తెప్పించింది. యూనిఫాం వేసుకోకుండా ఇలా రంగుల దుస్తులు వేసుకొని వచ్చి పాఠశాలలోని బాలురను చెడగొడుతున్నారని వారిపై మండిపడ్డారు. అంతేకాకుండా సోమవారం నుంచి దుస్తులు ధరించకుండానే పాఠశాలకు రావాలంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆగ్రహం చెందిన విద్యార్థినులు.. తోటి విద్యార్థులతో కలిసి పాఠశాల నుంచి పోలీస్‌ స్టేషన్‌కు ర్యాలీగా తరలి వెళ్లి ఫిర్యాదు చేశారు. ప్రధానోపాధ్యాయుడు రాధేశ్యామ్‌ మాలవియాపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు స్టేషన్‌ ఇంఛార్జి జితేంద్ర అజ్నారే తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని