Jammu and Kashmir: తాలిబన్ల ముప్పునెలా ఎదుర్కోవాలి?

తాజా వార్తలు

Updated : 13/09/2021 14:14 IST

Jammu and Kashmir: తాలిబన్ల ముప్పునెలా ఎదుర్కోవాలి?

కసరత్తు ప్రారంభించిన భారత్‌ బలగాలు 

దిల్లీ: అఫ్గాన్‌ను ఆక్రమించిన తాలిబన్లు భవిష్యత్‌లో భారత్‌కు ముప్పుగా పరిణమిస్తే.. జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు తెగబడితే.. వారినెలా తరిమికొట్టాలి? సరిహద్దుల్లోనే ఎలా నిరోధించాలి? అన్న అంశంపై భారత భద్రతా బలగాలు కసరత్తు ప్రారంభించాయి. ఇందుకోసం కొత్త శిక్షణా ప్రణాళికను రూపొదించాల్సిందిగా సరిహద్దుల్లో మోహరించిన భద్రతా బలగాలకు, ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొంటున్న పోలీసులకు, ఇతర సాయుధ బలగాలకు కేంద్ర భద్రతా సంస్థ ఆదేశాలు జారీ చేసింది. అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు చాలా వేగంగా చేజిక్కించుకున్నారు. ఈ ప్రభావంపై భారత్‌ సహా చాలా దేశాలపై పడనుంది. గతంలో తాలిబన్లు కశ్మీర్‌లోకి చొరబడిన సందర్భాలు ఉన్నాయి. ఇతర దేశాల వ్యవహారాల్లో జోక్యం చేసుకోమని ఈసారి వారు చెబుతున్నా, ఆ మాటలను నమ్మే పరిస్థితి లేదు. అందుకే తాలిబన్‌ ముప్పును నివారించేందుకు ప్రత్యేక ప్రణాళిక తయారు చేయాలని భద్రతా బలగాలు భావిస్తున్నాయి. వారి పోరాట వ్యూహాలను, అనుసరించే పద్ధతులపై సరిహద్దుల్లో కాపలా కాస్తున్న చివరి సైనికుడికి కూడా అవగాహన కల్పించేలా ప్రణాళిక ఉండాలని అధికారులు భావిస్తున్నారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని